అసురన్ ఓ అద్భుతం.. నిన్న మహేష్.. నేడు కరణ్ జోహర్ ప్రశంసల వర్షం
విలక్షణ నటుడు ధనుష్, సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్‌లో వచ్చిన తమిళ చిత్రం అసురన్ బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నది. ఈ చిత్రం కాసుల వర్షాన్ని కురిపించడమే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల ప్రశంసల జల్లులో తడిసి ముద్దవుతున్నది. ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన సూపర్‌స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, డిస్టిబ్యూటర్ కరణ్ జోహర్ అసురన్ సినిమాపై పొగడ్తలతో ముంచెత్తారు. ట్విట్టర్‌లో కరణ్ జోహర్ ఏమన్నారంటే..

అసురన్ సినిమా గురించి మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. నీ హృదయాన్ని తట్టి భావోద్వేగానికి గురిచేస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక నన్ను వెంటాడింది. దర్శకుడు వెట్రి మారన్ టాలెంట్, కథ చెప్పిన విధానం అమేజింగ్. ధనుష్ ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. తుఫాన్ ముందు ప్రశాంతలా ఆయన నటన కనిపించింది. నటనలో ధనుష్‌కు సాటి లేరు. చిత్ర పరిశ్రమ సాధించిన విజయం అసురన్. తప్పకుండా ఈ సినిమా చూడండి అంటూ కరణ్ జోహర్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా, అసురన్ సినిమా చూసిన సూపర్ట్‌స్టార్ మహేష్‌బాబు సోషల్ మీడియాలో స్పందించారు. అసురన్ సహజసిద్ధమైన, ముతక కథాంశంతో హై ఇంటెన్సిటీతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను అద్బుతంగా తీర్చి దిద్దిన ధనుష్‌కు, దర్శకుడు వెట్రిమారన్, ప్రకాశ్ రాజ్, జవీ ప్రకాశ్, వేల్ రాజాకు కంగ్రాట్స్ అని మహేష్‌బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక వసూళ్ల పరంగా.. తమిళనాడులో 10 రోజుల్లోనే అసురన్ చిత్రం రూ.100 కోట్లను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.150 కోట్లు పూర్తి చేసుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రానున్న రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరనున్నది.


Click it and Unblock the Notifications











