సుశాంత్ సూసైడ్ ఎఫెక్ట్.. నెటిజన్ల కామెంట్లకు తట్టుకోలేక.. ప్రైవేట్ అకౌంట్ తెరిచిన స్టార్ ప్రొడ్యూసర్

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని మిగిల్చిన ఘటన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్. ఇంతవరకు అతని సూసైడ్ కి అసలు కారణం ఏమిటనేది తెలియలేదు. పోలీసులు ఎన్నో రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే సుశాంత్ సూసైడ్ చేసుకోవడం కొంతమంది స్టార్స్ ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. నెపొటిజమ్ కారణంగా సుశాంత్ లాంటి హీరోలను తొక్కేస్తున్నారని కామెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఎక్కువగా ఈ కామెంట్స్ కి బాధపడింది మాత్రం కరణ్ జోహార్. ఇక ఆయన సపరేట్ గా ఒక ప్రయివేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవడం వైరల్ అవుతోంది.

ఇంకా అదే షాక్ లో..

ఇంకా అదే షాక్ లో..

బయటకు చెప్పకపోయినప్పటికి కరణ్ జోహార్ ఇంకా ఆ షాక్ నుంచి కొలుకోలేదనే తెలుస్తోంది. ఎందుకంటే గతంలో సుశాంత్ సింగ్ పై అతను చేసిన కామెంట్స్ అలాగే ఇతర సెలబ్రెటీస్ తో చర్చించిన విధానం నెటీజన్స్ ఇంకా మర్చిపోలేదు. అందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఇంటర్నెట్ ప్రపంచంలో కరణ్ జోహార్ కి ఒక భయాన్ని కలిగించారు.

అజ్ఞాతంలోకి కరణ్..

అజ్ఞాతంలోకి కరణ్..

కేవలం స్టార్స్ పిల్లలతోనే సినిమాలు చేస్తాడని అతనికి సపరేట్ గా ఒక గ్యాంగ్ ఉందని ఇతరులకు అవకాశాలు లేకుండా చేస్తాడని కూడా కామెంట్స్ చేయడం కరణ్ ని బాగా కలచివేసింది. విమర్శల గోల తట్టుకోలేక పోయిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ దెబ్బకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇన్స్టాగ్రామ్ లో స్టార్స్ ని అన్ ఫాలో చేసి సోషల్ మీడియాను దాదాపు క్లోజ్ చేసేశారని టాక్ వచ్చింది.

 ప్రయివేట్ ఇన్స్టాగ్రామ్..

ప్రయివేట్ ఇన్స్టాగ్రామ్..

అయితే కరణ్ జోహార్ ప్రయివేట్ గా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ అకౌంట్ ఇప్పుడు డియాక్టివేట్ చేయబడినట్లు కనిపిస్తోంది. లేదా పేరు చేంజ్ చేసినట్లు అనిపిస్తోంది. ఇందులో ఒక పోస్ట్ మాత్రమే ఉంది. కరణ్ సన్నిహితులు సుహానా ఖాన్, శ్వేతా బచ్చన్, గౌరీ ఖాన్, అనన్య పాండే వంటి వారు ఆ అకౌంట్ ని ఫాలో అవుతున్నారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
 ఆ ఫోటో వైరల్..

ఆ ఫోటో వైరల్..

ఇటీవల, కరణ్ నీతు కపూర్ పుట్టినరోజు వేడుకలకు హాజరైన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. ఆ ఫోటోను నీతు పోస్ట్ చేశారు. రణ్ బీర్ కపూర్, రిద్దిమా కపూర్ సాహ్ని, సమైరా మరియు బచ్చన్స్ కూడా ఆ ఫొటోలో దర్శనమిచ్చారు. ఇక కరణ్ గతంలో మాదిరిగా అయితే సోషల్ మీడియాలో చురుగ్గా కనిపించడం లేదు. త్వరలో ఆయన నిర్మించిన జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. మరి ఆ సినిమా కోసమైనా మళ్ళీ సోషల్ మీడియాలో చురుగ్గా కనిపిస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X