రాజమౌళి సినిమాలపై బాలీవుడ్ నిర్మాత షాకింగ్ కామెంట్స్.. దుమ్మెత్తిపోతున్న నెటిజన్లు!

బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా అంతో ఇంతో పరిచయం ఉండే ఉంటుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో నిర్మితమవుతున్న తరుణంలో కరణ్ జోహార్ లాంటి నిర్మాతల పేర్లు కూడా టాలీవుడ్ లో సాధారణంగానే వినిపిస్తున్నాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'లైగర్' చిత్రాన్ని కూడా నిర్మించారు. ఆ మధ్యలో పూరీ, విజయ్ తో కలిసి మీడియాలో ఎక్కువగా కనిపించి తెలుగు ఆడియెన్స్ కు దగ్గరయ్యారు. దర్శకుడిగా, నిర్మాత ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు కరణ్ జోహార్...

ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా 'కాఫీ విత్ కరణ్' టాక్ షోతో ఎప్పుడూ బాలీవుడ్ మీడియాలో హైలెట్ గానే నిలుస్తుంటారు కరణ్. హీరోహీరోయిన్ల ఎఫైర్స్ గురించి అడుగుతూ ఫ్యాన్స్, ఆడియెన్స్ లో ఆతృతను పెంచుతుంటారు. పలు సీక్రెట్స్ ను లాగుతూ సెన్సేషన్ గా మారుతుంటారు. అయితే రీసెంట్ గా కరణ్ జోహార్.. కోమల్ నేహాతకు చెందిన యూట్యూబ్ గేమ్ ఛేంజర్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సరదాగా మాట్లాడారు. ఈక్రమంలోనే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Karan Johar Shocking Comments on SS Rajamouli Movies Netizens Reaction on Bollywood Producer

ఎస్ఎస్ రాజమౌళి సినిమాలపై ఇలా స్పందించినట్టు వార్తలు వచ్చాయి. ఎస్ఎస్ రాజమౌళి సినిమాల్లో లాజిక్ ఉండదని, కేవలం ఒక నమ్మకంతోనే సినిమా తీసి, ప్రజలను దాన్ని నమ్మేలా చేస్తారు.. లాజిక్ లేకుండా సక్సెస్ అయ్యారని కరణ్ జోహార్ అన్నట్టు సోషల్ మీడియాలో, బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. ఎస్ఎస్ రాజమౌళి సత్తా ఎంటో దేశమంతా తెలియడంతో ఆయా వేదికల నుంచి కరణ్ జోహార్ మాటలను ఖండిస్తున్నారు నెటిజన్లు. మరికొందరైతే రాజమౌళి సినిమాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదని కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

కాగా.. తాజాగా కరణ్ జోహార్ ఈ వార్తలపై స్పందించారు. తాను చెప్పిందొకటైతే మరోలా పలు మీడియా సంస్థలు ప్రచురిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా వక్రీకరించడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటితో అంతా ఆపేయాలని కోరారు... అయితే.. బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాలన్నీ లాజిక్ తో నిర్మించినవి కాదని, బలమైన నమ్మకంతోనే నిర్మించినవి. ఈ క్రమంలోనే బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలను ప్రధానంగా ఉదహరించారు. కానీ అది మరో అర్థాన్ని ఇచ్చేలా ఉండటంతో రాజమౌళి సినిమాలపై ఇలాంటి కామెంట్లా అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.

Karan Johar Shocking Comments on SS Rajamouli Movies Netizens Reaction on Bollywood Producer

మొత్తానికి రాజమౌళి సినిమాలపై బాలీవుడ్ నిర్మాతలు, మరెవరైనా మాట్లాడేప్పుడు సరిగా మాట్లాడలని, జాగ్రత్తగా చెప్పాలనే విధంగా నెటిజన్లు ఫైర్ అయ్యారు. కరణ్ జోహార్ కూడా రియాక్ట్ అవ్వడంతో ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గ్గా మారింది. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 ప్రాజెక్ట్ పనిలో జక్కన్న బిజీగా ఉన్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ కొనసాగుతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచర్ కథను విజేంద్ర ప్రసాద్ ఇప్పటికే సిద్ధం చేసి జక్కన్న చేతికి అందించారు. ప్రియాంక చోప్రా, మహేశ్ బాబు, మరికొంతమంది నటీనటులతో షూట్ కొనసాగుతోందని తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: karan johar ss rajamouli ssmb29
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X