twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సూసైడ్.. కరణ్ జోహర్‌పై దెబ్బపడింది.. కీలక పదవికి రాజీనామా!

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న దాడి దెబ్బ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్‌పై గట్టిగానే పడినట్టు కనిపిస్తున్నది. బంధుప్రీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కరణ్ జోహర్ ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ పదవి నుంచి తప్పుకొన్నారు. సుశాంత్ మరణం తర్వాత తనపై భారీగా ఆరోపణలు రావడంతో ఈ షాకింగ్ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..

    కరణ్‌ జోహర్‌పై ట్రోలింగ్ ఎఫెక్ట్

    కరణ్‌ జోహర్‌పై ట్రోలింగ్ ఎఫెక్ట్

    సుశాంత్ మరణం తర్వాత కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సోనమ్ కపూర్, సోనాక్షి సిన్షా, ఆలియాభట్ ఇంటర్వ్యూలు అత్యంత వివాదాస్పదమయ్యాయి. తన కార్యక్రమంలో సుశాంత్‌ను కించపరిచే విధంగా పలువరు యాక్టర్లను పోత్సహించిన క్రమంలో కరణ్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ దాడులు జరిగాయి. భారీ సంఖ్యలో కరణ్ అకౌంట్ నుంచి అన్‌ఫాలో అయ్యారు.

    భారీగా ట్రోలింగ్‌తో మనస్తాపం

    భారీగా ట్రోలింగ్‌తో మనస్తాపం

    సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఎదురైన సంఘటనలు కరణ్ జోహర్‌ను తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్టు తెలిసింది. గత కొద్దికాలంగా మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ మౌనాన్ని పటిస్తున్నారు. దాదాపు సామాజిక జీవితానికి కూడా దూరమైనట్టు కనిపించింది. ఈ క్రమంలో మామి ఫిల్మ్ ఫెస్టివల్ బోర్డు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకొన్న కరణ్ జోహర్ తాజాగా తన రాజీనామా లేఖను సంస్థ డైరెక్టర్ స్మృతి కిరణ్‌కు పంపినట్టు తెలిసింది

    బాలీవుడ్‌లో ప్రకంపనలు, రంగంలోకి దీపికా పదుకోన్

    బాలీవుడ్‌లో ప్రకంపనలు, రంగంలోకి దీపికా పదుకోన్

    అయితే మామి నుంచి కరణ్ జోహర్ తప్పుకోవడం బాలీవుడ్ ప్రముఖులను కంగారుకు గురి చేసింది. ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ (మామి)కి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న దీపికా పదుకోన్ స్పందించి రాజీనామాను వెనుకకు తీసుకోవాలని కరణ్‌కు సూచించారట. అయితే అప్పటికే తన నిర్ణయంపై కఠిన వైఖరితో ఉండటంతో కరణ్ రాజీనామాను ఉపసంహరించుకొవడానికి నిరాకరించారట.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    మామి ప్రతిష్టాత్మకంగా

    మామి ప్రతిష్టాత్మకంగా

    బాలీవుడ్‌ సినిమా పరిశ్రమలో ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ (మామి)కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ బోర్డులో జోయా అఖ్తర్, కబీర్ ఖాన్, సిద్దార్థ్ రాయ్ కపూర్, విక్రమాదిత్య మోత్వానీ, రోహన్ సిప్పి లాంటి సభ్యులుగా ఉన్నారు. కరణ్ జోహర్ రాజీనామాతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ అంశం మరోసారి జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది.

    English summary
    Bollywood director Karan Johar resigned for director post of MAMI Board which organised Festival in hindi film industry in Mumbai. After Susanth Singh Suicide, Heave trolls targeted on Nepotism issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X