జెర్సీ కోసం కరణ్ జోహార్‌తో చేతులు కలపబోతున్న దిల్ రాజు!

నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి తిరుగులేని స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. నాని నటనతో అదరగొట్టేశాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. నాని క్రికెటర్ అర్జున్ పాత్రలో ఎమోషనల్ నటనతో కట్టిపడేశాడు. గౌతమ్ తిన్ననూరి తన దర్శకత్వ ప్రతిభతో అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ కూడా అద్భుతంగా నటించింది. ఈ చిత్రానికి అప్పుడే రీమేక్ హక్కుల విషయంలో ఇతర భాషల్లో డిమాండ్ పెరిగిపోయింది.

ఇక టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ జెర్సీ చిత్రంతో పెద్ద ప్లానే వేసినట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దేశవ్యాప్తంగా పాపులర్ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం జెర్సీ చిత్రాన్ని ఉపయోగించుకొనునట్లు తెలుస్తోంది. జెర్సీ చిత్ర హిందీ రీమేక్ హక్కులని సొంతం చేసుకుని.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించాలని దిల్ రాజు భావిస్తున్నారట.

Karan Johar teaming up with Dil Raju for Jersey remake

జెర్సీ చిత్రం విషయంలో దిల్ రాజు ఇప్పటికే కరణ్ జోహార్ తో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కకరణ్ జోహార్ ఇప్పటికే బాహుబలి రెండు భాగాలని హిందీలో విడుదల చేశారు. అప్పటి నుంచి కరణ్ జోహార్ కు టాలీవుడ్ ప్రముఖులతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. నాని తరహాలో హిందీలో ఎవరు నటిస్తారు.. దర్శకుడు ఎవరు లాంటి అంశాలన్నీ త్వరలో తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X