twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీరెడ్డిపై ఫిర్యాదు.. ఆ పేరు పలికితే అపవిత్రం.. కరాటే కళ్యాణి కామెంట్స్

    |

    టాలీవుడ్‌లో మీటూ ప్రకంపనలు సృష్టించిన శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉంది. గతవారం రాకేష్ మాష్టర్ చేసిన కామెంట్స్, కరాటే కళ్యాణి కామెంట్స్‌పై ఫైర్ అవుతూ ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చింది శ్రీరెడ్డి. ఇక ఇన్ని రోజులు మౌనంగా ఉన్న శ్రీరెడ్డి.. తన విశ్వరూపాన్ని చూపెట్టింది. ప్రతీ మాటకు సెన్సార్ కట్ చెప్పాల్సిందే. ఆ రేంజ్‌లో తన మాటల ప్రవాహం పోటెత్తింది. అసభ్యకర పదజాలంతో అందరిపై రెచ్చిపోయింది.

     కరాటే కళ్యాణిపై ఫైర్..

    కరాటే కళ్యాణిపై ఫైర్..

    ఫిబ్రవరి 15 రాత్రి లైవ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి.. రాకేష్ మాష్టర్, కరాటే కళ్యాణి, పవన్ కళ్యాణ్ ఇలా అందర్నీ ఓ రౌండ్ వేసుకుంది. ఎంత మందితో పడుకున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? ఎంత మందిని పెళ్లి చేసుకున్నావో నాకు తెలియదా? నీ భర్త అంతా చెప్పాడంటూ కరాటే కళ్యాణిని ఉద్దేశించి.. శ్రీరెడ్డి రెచ్చిపోయింది. సీరియల్ డైరెక్టర్, సినీ నటులు, ఎవ్వరిది పడితే వాడిది *** ఈ స్థాయికి వచ్చావు. వంద డాలర్లు ఇస్తే ఎవ్వరిదైనా *** అంటూ రాయడానికి, వినడానికి, చదవాడినికి వీల్లేనట్టు మాటలతో రెచ్చిపోయింది.

     కౌంటర్ వేసిన కళ్యాణి..

    కౌంటర్ వేసిన కళ్యాణి..

    శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. ‘ఒక తాటకి పూతన ఈజాతి చెందిన రాక్షస ప్రవృత్తి తో సంచరిస్తూ..మనుజులను నీ అవసరాలకు ఉపయోగిస్తున్న..చెత్తదనా...అడపుట్టుక కు అర్థం ఉంది...దాని విలువ తీసావు కాబట్టి ..దయా సత్యంచ సౌత్యంచ క్షసానం న విద్యాతే.... ఐయింది...జై శ్రీరాం' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

    పోలీసులకు ఫిర్యాదు..

    పోలీసులకు ఫిర్యాదు..

    శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కరాటే కళ్యాణి చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. సోషల్ మీడియా లైవ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిని వెంటనే అరెస్ట్ చెయ్యాలని కరాటే కళ్యాణి కోరింది. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ విచారణ జరపి శ్రీరెడ్డిపై 67 ఐటీ యాక్ట్, 506, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

    Recommended Video

    Sri Reddy Posts An Unknown Person Pics, Who Is He?? || Filmibeat Telugu
    ఆ పేరు పలికితే అపవిత్రం..

    ఆ పేరు పలికితే అపవిత్రం..

    అయితే ఈ విషయంపై స్పందించేందుకు కరాటే కళ్యాణి లైవ్‌లోకి వచ్చింది. కొందరు తనపై అసభ్య కరమైన కామెంట్స్ చేశారని, అలాంటి వారి కోసం తాను ఈ లైవ్ పెట్టలేదని, వారు తన స్థాయి కాదని, అలాంటి వారికి విలువే లేదని చెప్పుకొచ్చింది. అలాంటి వారి కోసం లైవ్‌లోకి రావాల్సిన పనిలేదని తెలిపిందే. ఆడవాళ్లలో కూడా రాక్షస జాతి ఉంటుందని, అలాంటి వారికి మామూలుగా చెబితే అర్థం కాదని పేర్కొంది. లైవ్ మొత్తంలో శ్రీ రెడ్డి పేరు కూడా పలకలేదు.. ఆ పేరు పలికితే అపవిత్రమని తాను ఫిర్యాదు చేసిన విషయాన్ని స్క్రోలింగ్ ద్వారా చూపెట్టింది.

    English summary
    Karate Kalyani Files Case Against Srireddy. After Srireddy Abuse Karate Kalyani In Social Media, She Filed A Case In Cyber Crime.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X