Karate Kalyani: సూర్య కిరణ్ చనిపోవడానికి అసలు కారణాలు ఇవే.. అంతా కళ్యాణీయే చేసింది!
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సూర్య కిరణ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈయన అనారోగ్య సమస్యలతో ఈరోజు ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా పచ్చ కామెర్ల వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన ఈయన మృతికి అసలైన కారణాలు ఇవే అంటూ సెన్సేషనల్ కామెంట్లు చేసింది నటి కరాటే కల్యాణీ. ఆయన మృతికి ఆయన మాజీ భార్య కళ్యాణీయే కారణం అంటూ వివరించింది. ఆమె ఎలా కారణమో కూడా చెప్పుకొచ్చింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నటి కరాటే కళ్యాణీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడే తనకు బిగ్ బాస్ లో పరిచయం అయి క్లోజ్ ఫ్రెండ్ గా మారిన సూర్య కిరణ్ మృతిపై స్పందించింది. ముఖ్యంగా ఆయన చనిపోవడానికి గల కారణాలు గురించి వివరించింది. అసలు సూర్య కిరణ్ గారు చనిపోవడానికి ఆయన అలవాట్లేనని తెలిపింది. సూర్య కిరణ్ కు మందుతాగే అలవాటుతో పాటు సిగరెట్లు తాగే అలవాటు చాలా ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చింది. వాటి వల్లే ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయని చెప్పింది.

రోజూ.. ఎక్కువగా సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం చేసే వారని నటి కరాటే కల్యాణి వెల్లడించింది. వాటి వల్లే ఆయన చాలా కాలంగా అనేక రకాల హెల్త్ సమస్యలతో బాధ పడుతున్నారని.. ఈరోజు ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చింది. అయితే ఆయన అంతగా మద్యం సేవించడానికి, సిగరెట్లు తాగడానికి చాలా కారణాలు ఉన్నాయని కూడా క్లారిటీ ఇఛ్చింది. ఆయన మాజీ భార్య, హీరోయిన్ కళ్యాణీ వల్లే ఆయనకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటూ పేర్కొంది.
సూర్య కిరణ్ కు ఆమె విడాకులు ఇచ్చిన తర్వాత నుంచి చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని.. అందువల్లే తాగడం అలవాటు చేసుకున్నారని కూడా వివరించింది. కానీ సూర్య కిరణ్ ఇంత త్వరగా చనిపోతారని తాను అనుకోలేదని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. భూలోకంలో ఉన్నప్పుడు అసలు ఆయనకు శాంతి లేదని.. కనీసం ఇలా, ఇప్పుడు అయినా శాంతి చేకూరాలని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. ఆయన రెండు, మూడు నెలల క్రితమే తనకు ఫోన్ చేసి హైదారబాద్ కు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడని తెలిపింది.
ఆయన ఇక్కడ రెంట్ కు ఓ ఇళ్లు కూడా చూడమన్నారని.. తాను ఓ ఇల్లు చూడగా.. అది తనకు సరిపోదాన్నారని వివరించింది. కాస్త పెద్దది చూడమ్మా అంటూ చెప్పగా.. తాను ఓకే అన్నానని వివిరించింది. ఇక ఆ తర్వాత నుంచి ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. తాను బిజీగా ఉండడంతో ఫోన్ చేసి మాట్లాడడం, కలవడం కుదరలేదని తెలిపింది. హైదరాబాద్ కు ఎప్పుడు వచ్చిన తన ఇంటికి వచ్చేవాడని.. ఆయన మృతి వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లు స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications











