For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పాలిటిక్స్ లోకి కరాటే కళ్యాణి.. వాటి గురించి లక్ష్మీ పార్వతిని అడగండి, మోహన్ బాబు క్షమాపణలు!

  |

  నటిగా కంటే ఎక్కువగా ఏదో ఒక వివాదాస్పద అంశాలతోనే వార్తల్లో నిలుస్తూనే కరాటే కళ్యాణి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. తాజాగా తాను రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

   రాజకీయ ఎంట్రీ

  రాజకీయ ఎంట్రీ

  నటిగా హరికథా కళాకారిణిగా పేరు తెచ్చుకున్న కరాటే కళ్యాణి కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. ఆమె అసలు పేరు పడాల కళ్యాణి కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్ కావడంతో ఆమెను కరాటే కళ్యాణి సంబోధిస్తూ ఉంటారు. తెలుగు సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రలకు ప్రసిద్ధి చెందిన ఆమె ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంటున్నారు.

  నిజానికి పావలా శ్యామల కష్టాల్లో ఉన్న విషయం కరాటే కళ్యాణి ద్వారానే వెలుగులోకి వచ్చింది. ఇక రెండో దశ లాక్ డౌన్ సమయంలో అలాగే మొదటి దశ సమయంలో కూడా కరాటే కళ్యాణి తనకు సంబంధించిన ఒక హిందూ ధార్మిక సంస్థ ద్వారా అనేక మందికి సహాయం చేస్తూ వచ్చారు.

  లక్ష్మీపార్వతి గారికి తెలుసన్నమాట

  అయితే ఆమె ఈ విధంగా సహాయం చేస్తున్నప్పుడే ఆమె ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరే అవకాశం ఉందని గుసగుసలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారంటూ ఆమె కొద్ది సేపటి క్రితం తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. " జైశ్రీరామ్ ఆగస్టు 15న నా శుభ ముహూర్తం కాషాయ దళం లోకి , మీ ఆశీస్సులు కోరుతూ భారత్ మాతాకీ జై" అంటూ ఆమె పోస్ట్ చేశారు.

  కాషాయ దళం లోకి అనగానే బిజెపిలో చేరుతున్నారా అంటూ ఆమెకు పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చి పడగా అవునని తాను బీజేపీలోనే చేరుతున్నానని ఆమె వెల్లడించారు. ఇక దీనికి తోడుగా ఆమె చేసిన మరో పోస్టు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

  లక్ష్మీపార్వతి గారికి తెలుసన్నమాట

  లక్ష్మీపార్వతి గారికి తెలుసన్నమాట

  పేకముక్కలు గురించి నాకన్నా బాగా లక్ష్మీపార్వతి గారికి తెలుసన్నమాట అందుకేనేమో పదవి వచ్చింది, దేనికో అధ్యక్షులు విన్నాను ఈసారి పేక విషయంలో ఆమె పేరు వాడండి అంటూ ఆమె వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు.. నిజానికి కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన తెలుగు అకాడమీని తెలుగు - సంస్కృత అకాడమీగా పేరు మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  ఈ విషయంలో అధికార వైసీపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం తెలుగు అకాడమీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న నందమూరి లక్ష్మీ పార్వతి ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టి తెలుగు సంస్కృతం అనేవి పేక ముక్కలతో కలిసిపోయాయని ఆమె చెప్పుకొచ్చారు. నిజానికి ఆమె అక్కడ వాడాల్సిన పదం పడుగు పేకలు అని, ఈ విషయం పెద్ద ఎత్తున ట్రోల్ కావడంతో ఆమె దానికి క్షమాపణలు చెబుతూ మరో ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ అంశం మీద కళ్యాణి ఆమెను టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

  పరిణామాలు మాములుగా ఉండవు

  అంతేకాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1500 కేజీల బంగారాన్ని తాకట్టు పెట్టి పాతిక వేల కోట్ల రూపాయల రుణం తీసుకోబోతోందని గత కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ షేర్ చేసిన కరాటే కళ్యాణి ''మా దేవుడిని నమ్మరు ప్రసాదాలు తినరు.. పండగలకి వేషాలు వేసి మళ్ళీ తుడిచేసుకుంటారు ఇలాంటివి చెయ్యొచ్చా .. వెంకన్న జోలికి వస్తే.... తరువాత పరిణామాలు మాములుగా ఉండవు.. నేను ఇలాంటివి చూస్తూ ఊరుకోను. నువ్వు హిందువు అయితే ప్రశ్నించు, అంటూ కామెంట్ చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె నిన్న మధ్యాహ్నం మంచు మోహన్ బాబును కలిసి కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశారు.. ఈ సందర్భంగా ఆమె ధైర్యంగా హిందూ ధర్మం కోసం పోరాడుతున్నామని మోహన్ బాబు తనను సత్కరించారు అని పేర్కొన్నారు.

  Recommended Video

  Prabhas పై Mission Impossible 7 Director కామెంట్స్, రూమర్స్ కి చెక్ || Filmibeat Telugu

  మోహన్ బాబు క్షమాపణ

  అంతేకాక స్నేహితుల దినోత్సవం రోజు రజనీకాంత్ మోహన్ బాబు కోసం అద్భుతంగా మాట్లాడి పంపిన ఒక వీడియో చూశాక రజినీకాంత్ గారి ని కలవాలి అని అనగానే వెంటనే మోహన్ బాబు గారు కల్పిస్తానని అన్నారు అని అని చెప్పుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ కి వాళ్ళ సినిమాల్లో హిందుత్వాన్ని బ్రాహ్మణులను అవమానించే సీన్స్ తీస్తారా అనే ఒక నెటిజన్ కామెంట్ పెట్టగా ఆ విషయంలో మోహన్ బాబు క్షమాపణ అడిగారని త్వరలోనే ఒక సినిమాలో రాముని కీర్తన ఒక అద్భుతమైన పాట ఉంటుంది చూడండి అంటూ కరాటే కల్యాణి హింట్ ఇచ్చారు. మరి ఆమె చెప్పినట్లుగానే ఆగస్టు 15వ తారీఖున రాజకీయాల్లో చేరి చక్రం తిప్పుతారు ఏమో వేచి చూడాలి మరి.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Karate Kalyani is one of the popular character artist in Telugu Film Industry and she has appeared in superhit Telugu movies such as Chatrapati, Raja the Great. According to the latest buzz, Karate Kalyani is planning to join BJP- Bharitya Janatha Party.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X