తైమూర్ విషయంలో మీడియా అతి.. ఫైర్ అయిన కరీనా కపూర్!
బాలీవుడ్ జంట కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కుమారుడు తైమూర్ సోషల్ మీడియాలో ఎంతటి సెన్సేషన్ గా మారాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తైమూర్ క్యూట్ లుక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతుండడంతో అతడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తైమూర్ క్రేజ్ తో అతడి రూపంలో ఉన్న బొమ్మలు కూడా మార్కెట్ లో తెగ అమ్ముడైపోతున్నాయి. తైమూర్ విషయంలో మీడియా చూపిస్తున్న అత్యుత్సాహంపై కరీనా కపూర్ తాజాగా స్పందించారు.
మీడియా గురించి ఇలా మాట్లాడుతున్నందుకు సారీ. తైమూర్ పై మీడియా నిఘా ఎక్కువైంది. తైమూర్ ఎక్కడ కనిపించినా.. తైమూర్.. తైమూర్ అని అరుస్తున్నారు. తైమూర్ చిన్నపిల్లాడు కాబట్టి.. ఇంతమంది పిలుస్తుంటే అతడు సంబరపడుతాడు. కానీ ఓ తల్లిగా నా కొడుకుని అందరి పిల్లల్లాగే పెంచాలని అనుకుంటున్నా. తైమూర్ ని మీడియాకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. అలాగని తైమూర్ ని ఇంట్లో నుంచి కదలనివ్వకుండా, ఆడుకోనివ్వకుండా అడ్డుకోలేం.

అదే పనిగా తైమూర్ ఫోటోలు తీయవద్దని మీడియాని రిక్వస్ట్ చేస్తున్నా అని కరీనా కపూర్ తెలిపారు. ఇక మార్కెట్ లోకి వచ్చిన తైమూర్ ని పోలిన బొమ్మల గురించి కూడా కరీనా స్పందించింది. ఉంగరాల జుట్టు, నీలం కళ్ళు ఉంటే నా కొడుకైపోతాడా అని ప్రశ్నించింది.


Click it and Unblock the Notifications











