వైల్డ్ డాగ్ సినిమా చూసిన తర్వాతే.. సుల్తాన్ చూడండి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కార్తీ
డ్రీమ్ వారియర్ పిక్చరస్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మాతలుగా బక్కిరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన థ్రిల్లర్, రొమాంటిక్ చిత్రం సుల్తాన్ ఏప్రిల్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వంశీ పైడిపల్లి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కేకే రాధామోహన్, డిస్టిబ్యూటర్ వరంగల్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ..
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఉండటం వల్ల సుల్తాన్ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేశాం. మా అన్నయ్య నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా కూడా అదే రోజున వస్తున్నది. నాగ్ అన్నయ్య సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకొంటున్నాను. అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన వంశీ పైడిపల్లికి ధన్యవాదాలు. ఊపిరి సినిమా కథ చెప్పగానే ఒప్పుకొన్నాను. నాగార్జునతో పరిచయం ఏర్పడుతుందనే సినిమా చేశాను అని కార్తీ అన్నారు.

ఇక సుల్తాన్ సినిమా విషయానికి వస్తే.. మహాభారతంలోని ఓ పాయింట్ తీసుకొని సినిమాను రూపొందించారు. శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన కాకుండా కౌరవులతో ఉంటే ఎలా ఉంటుందనే పాయింట్ చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించారు.
సుల్తాన్ సినిమా చాలా బాగుంటుంది. మా అన్నయ్య నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా చూసిన తర్వాత మా సుల్తాన్ సినిమా చూడండి అంటూ కార్తీ అన్నారు.


Click it and Unblock the Notifications











