కార్తి ‘దేవ్’ మేకింగ్ మేకింగ్ వీడియో... ఫన్నీగా ఉంది!
కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'దేవ్' ప్రేమికుల రోజు సందర్భంగా జనవరి 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా వదిలిన మేకింగ్ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుగుతుండగా కార్తితో పాటు సినిమాకు పని చేసిన టెక్నీషియన్లను ప్రశ్నిస్తూ సాగిన ఈ వీడియో ఫన్నీగా ఉంది.
రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కార్తి, రకుల్ ప్రీత్ కలిసి నటించిన రెండో చిత్రం ఇది. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఖాకీ' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే కుర్రాడి పాత్రలో కార్తి, తన సంతోషం కోసం స్వార్థంగా ఆలోచించే అమ్మాయి పాత్రలో రకుల్ ప్రీత్ నటిస్తోంది. వీరిద్దరి మధ్య జరిగే ప్రేమ కథ ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
'దేవ్'లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. నిక్కీ గల్రానీ సెకండ్ హీరోయిన్‌గా చేస్తోంది. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తున్నారు. రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ 'దేవ్' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: హ్యారిస్ జైరాజ్, సినిమాటోగ్రఫీ: ఆర్ వేల్రాజ్, ఆర్ట్: రాజీవన్, ఎడిటర్: రుబెన్, నిర్మాతలు: ఎస్ లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మధు, దర్శకత్వం: రజత్ రవిశంకర్.


Click it and Unblock the Notifications