హీరో కార్తి ‘దేవ్’ మూవీ రిలీజ్ డేట్ ఖరారు, ఆడియో ఎప్పుడంటే...

తమిళ స్టార్ కార్తీ త్వరలో 'దేవ్' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రజత్ రవిశంకర్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా రిలీజ్ డేట్ లాక్ చేసి అఫీషియల్ ప్రకటన చేశారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం విడుదలకాబోతోంది.

మరో వైపు ఈ మూవీ ఆడియో రిలీజ్ డేట్ కుడా ఖరారైంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న పాటలు విడుదల చేయబోతున్నారు. ఖాకీ తర్వాత రెండోసారి కార్తి-ర‌కుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది.

Karthi s DEV releasing on Feb 14th

నిక్కీ గిర్లానీ సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ప్ర‌కాశ్ రాజ్, ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆర్ వేల్రాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్ స‌మ‌ర్పిస్తున్న ఈ మూవీ ప్రిన్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్లో నిర్మించబడుతోంది.

ఇంకా కార్తిక్ ముత్తురామ‌న్, ఆర్జే విఘ్నేష్, రేణుక‌, అమృత‌, వంశీ, జ‌య‌కుమార్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ మూవీకి ద‌ర్శ‌కుడు: ర‌జ‌త్ ర‌విశంక‌ర్, నిర్మాత‌లు: ఎస్ ల‌క్ష్మ‌ణ్ కుమార్, ఠాగూర్ మ‌ధు, నిర్మాణ సంస్థ‌లు: ప్రిన్స్ పిక్చ‌ర్స్, లైట్ హౌజ్ మూవీ మేక‌ర్స్, రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్, స‌మ‌ర్ప‌ణ‌: రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్, సంగీతం: హ‌రీష్ జయ‌రాజ్, సినిమాటోగ్ర‌ఫీ: వేల్రాజ్, ఆర్ట్: రాజీవ‌న్, ఎడిట‌ర్: రూబెన్
విఎఫ్ఎక్స్: హ‌రిహ‌ర‌సుధ‌న్ .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X