Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'దేవ్' ట్రైలర్: అడ్వెంచర్ చేసే కుర్రాడు.. సెల్ఫిష్‌గా ఉండే అమ్మాయి!
తమిళ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆవారా, నా పేరు సూర్య, ఊపిరి చిత్రాలతో కార్తీకి సౌత్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. కార్తీ చివరగా నటించిన చిత్రం చినబాబు. ఈ చిత్రం తమిళనాడులో కమర్షియల్ గా విజయం సాధించింది కానీ తెలుగులో ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం కార్తీ నటిస్తున్న తాజా చిత్రం దేవ్. రాజత్ రవిశంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. స్టైలిష్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కార్తీ సరసన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ నటిస్తుండడం విశేషం. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.
రొమాంటిక్, ఫన్, యాక్షన్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే కుర్రాడిగా కార్తీ కనిపిస్తున్నాడు. తన సంతోషం కోసం స్వార్థంగా ఆలోచించే అమ్మాయిగా రకుల్ ప్రీత్ నటిస్తోంది. వీరిద్దరిమధ్య ప్రేమ ఎలా మొదలైందనేదే ఈ చిత్రం ప్రధాన అంశంగా కనిపిస్తోంది. 'బావ ఏ పని చేస్తే డబ్బు, పేరు కన్నా మనసు ప్రశాంతంగా ఉంటుందో అదేరా నువ్వు చేయాల్సిన పని' అంటూ కార్తీ తన స్టైల్ లో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
మగతోడే కాదు.. ఇనీషియల్ లేకపోయినా బతకగలను అంటూ రకుల్ ప్రీత్ చెప్పే డైలాగ్ కూడా ఆసక్తికరంగా ఉంది. 'నేను సెల్ఫిష్ నే.. జీవితంలో సంతోషంగా ఉండడానికి సెల్ఫిష్ గా ఉండడంలో ఏ తప్పు లేదు అనే డైలాగ్ రకుల్ ప్రీత్ పాత్రని తెలియజేసే విధంగా ఉంది. విజువల్స్ కూడా కట్టుకునే విధంగా ఉన్నాయి. హారిస్ జైరాజ్ ఈ చిత్రాన్ని సంగీత దర్శకుడు.