Donga ట్విట్టర్ రివ్యూ: ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..
కార్తీ హీరోగా తెలుగులో 'దొంగ' సినిమా నేడు (డిసెంబర్ 20) విడుదలైంది. తమిళంలో తమిళంలో 'తంబి'గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జ్యోతిక, సత్యరాజ్, నిఖిల, ఆన్సన్, షావుకారు జానకి, సీత కీలక పాత్రలు పోషించారు. తమిళంలో వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ సంస్థలు నిర్మించగా.. తెలుగులో ఈ సినిమాను హర్షిత మూవీస్ పతాకంపై నిర్మాత రావూరి వి. శ్రీనివాస్ అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'దొంగ' పై మిక్స్‌డ్ టాక్
ఇప్పటికే 'దొంగ' సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. థ్రిల్లర్ మూవీగా విడుదలైన ఈ సినిమాలో కార్తి, సత్యరాజ్ నటన ఆకట్టుకుందని కొంత మంది అంటున్నారు. ‘ఖైదీ' తరవాత మరో హిట్ అని కూడా కొందరు ట్వీట్స్ చేస్తున్నారు.
వాళ్ళిద్దరి యాక్టింగ్ మేజర్ అసెట్..
దొంగ సినిమా కార్తీ యొక్క మరో బ్లాక్ బస్టర్. ఈ సినిమాకు సత్యరాజ్, జ్యోతిక యాక్టింగ్ మేజర్ అసెట్ అయ్యాయి.
ఫ్యామిలీ సెంటిమెంట్స్
దొంగ సినిమా జీతూ సొసెఫ్ నుంచి వచ్చిన ఓ సస్పెన్స్ థిల్లర్. ఫ్యామిలీ సెంటిమెంట్స్ జోడించి మంచి డోస్ ఇచ్చారు.
ఫ్యామిలీతో ఒక్కసారి చూడొచ్చు
ఫస్టాఫ్ బోరింగ్‌గా అనిపించినా, సెకండాఫ్ మాత్రం బాగుంది. కొంత కొంత గ్యాప్‌లో సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు ఆకట్టుకున్నాయి. జ్యోతిక సీన్స్ ఎక్కువగా లేవు.
దొంగను ఫ్యామిలీతో ఒక్కసారి చూడొచ్చు.
ఊహించని విధంగా ఫైనల్ ట్విస్ట్
దొంగ.. ఓ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సలెంట్ థ్రిల్లర్ మూవీ. ఫ్యామిలీ సెంటిమెంటల్ సీక్వెన్స్ జోడించి థ్రిల్ చేశారు. కార్తీ, జ్యోతిక బాగా పర్ఫార్మ్ చేశారు. ఫైనల్ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంది. నిజంగా వెల్ స్క్రిప్ట్.

మొత్తంగా చూస్తే..
మొత్తంగా చూస్తే.. ప్రీమియర్స్ ద్వారా ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం దొంగ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చిందని తెలుస్తోంది. ఇంకొన్ని గంటల్లో తెలుగు, తమిళ ప్రేక్షకులు ఈ సినిమాపై ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











