న్యాయంగా రాజమౌళి సినిమాలో తానే ఉండాలంటున్న కార్తీ.. ట్రైలర్ అదిరింది

దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో తనను కాదని ఎవరెవరినో పెడుతున్నారని అంటున్నాడు హీరో కార్తీ. తాజాగా విడుదలైన 'దొంగ' ట్రైలర్ ఈ పవర్‌ఫుల్ డైలాగ్ వాడారు కార్తీ. 'ఖైదీ' లాంటి ఎమోషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా తర్వాత 'దొంగ'గా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు హీరో కార్తీ.

వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై 'దృశ్యం' ఫేమ్‌ జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కింది 'దొంగ' సినిమా. ఈ సినిమాను హర్షిత మూవీస్‌ అధినేత రావూరి వి. శ్రీనివాస్‌ తెలుగులో అందిస్తున్నారు. షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Karthis Donga Trailer Released

ఇప్పటికే రిలీజైన దొంగ టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా దొంగ ట్రైలర్‌ సీడుదల చేసి సినిమాపై అంచనాలు రెట్టింపు చేశారు యూనిట్ సభ్యులు. ఈ ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలు, డైలాగ్స్ అదిరాయి. 'చిన్నా ఇంకా నా కళ్లలోనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే' అంటూ జ్యోతిక ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమై ఆకట్టుకుంది.

'ఎలా ఉందిరా పెర్‌ఫార్మెన్స్‌.. న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. ఎవరెవర్నో పెడుతున్నారు..' అంటూ తనదైన స్టైల్ కామెడీ టైమింగ్‌తో కార్తీ చెప్పిన డైలాగ్ అబ్బురపరుస్తోంది. ఇక ట్రైలర్ లో కనిపించిన యాక్షన్‌ సన్నివేశాలు ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. చూడాలి మరి 'దొంగ'గా కార్తీ ఏ మేర అలరిస్తాడో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X