Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఖైదీ ఫస్ట్ టాక్: కార్తి నటన, సినిమా ఎలా ఉందంటే..
తమిళ హీరో కార్తి నటించిన తాజా సినిమా 'ఖైదీ'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజే (అక్టోబర్ 5న) విడుదలైంది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ టాక్ ఎలా ఉందో చూద్దామా..
146 నిమిషాల నిడివితో ఖైదీ
ఓ వైపు విజయ్ విజిల్, మరోవైపు కార్తీ ఖైదీ ఈ రెండు సినిమాలు పోటాపోటీగా విడుడలయ్యాయి. ఇందులో కార్తీ ఖైదీ సినిమా విషయానికొస్తే.. 146 నిమిషాల నిడివి గల ఈ చిత్ర కథాంశం ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తోందట. ఈ రకంగా ప్రస్తుతానికి ‘ఖైదీ' సినిమాకు ఇది పాజిటివ్ టాక్ అని చెప్పుకోవచ్చు.
ఖైదీ సబ్జెట్.. అలాంటి వారికి
థ్రిల్లర్ జోనర్ సినిమాలు ఇష్టపడేవారికి ఖైదీ సబ్జెట్ బాగా కనెక్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఆసక్తికర కథాంశం, డైరెక్టర్ టెక్నిక్స్ ఈ సినిమాలో హైలైట్ అయ్యాయని తెలుస్తోంది. అద్భుతమైన నేపథ్య సంగీతం, ఎంగేజింగ్ స్క్రీన్ప్లే సినిమాకు ప్రధాన బలాలనే టాక్ బయటకొచ్చింది. ఈ మేరకు ట్విట్టర్లో అభిప్రాయాలు తెలుపుతున్నారు నెటిజన్లు.
ఢిల్లీలో పేరుమోసిన ఖైదీగా
ఢిల్లీలో ఓ పేరుమోసిన ఖైదీగా కార్తి నటన బాగుందని అంటున్నారు. చేసింగ్ సీన్స్ బాగున్నాయని, కథనం చాలా సహజంగా ఉందని టాక్ వచ్చింది. సినిమా అంతా కూడా రాత్రి వేళలోనే నడుస్తుందని, అయినప్పటికీ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుందని అంటున్నారు.
కార్తి, విలన్ గ్యాంగ్ మధ్య సీన్స్
కార్తీ మరియు విలన్ గ్యాంగ్ మధ్య వచ్చిన ఫైట్ సీన్స్ రియలిస్టిక్ గా ఉన్నాయని అంటున్నారు. సీరియస్ కథనంలోనే సందర్భానికి తగ్గట్టుగా వచ్చిన కొన్ని కామెడీ సీన్స్ థియేటర్ లోని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశాయని అంటున్నారు. చూడాలి మరి.. మొదటి షో ముగిశాక ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుంది అనేది.