లావణ్య త్రిపాఠి అంటే ఇష్టమట... సీక్రెట్ బయట పెట్టిన హీరో.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ రిప్లై
ఆర్‌ఎక్స్ 100 చిత్రంతో ఒక్కసారి అందరినీ తనవైపుకు తిప్పుకున్నాడు హీరో కార్తీకేయ. భగ్న ప్రేమికుడిగా కార్తికేయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆర్‌ఎక్స్ 100 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో వరుసగా ఆఫర్లు తలుపుతట్టాయి. అయితే మళ్లీ అంతటి పేరును తీసుకొచ్చే చిత్రం మాత్రం ఒక్కటీ రాలేదు. అయినా సరే చాన్సులు మాత్రం వస్తుండటం విశేషం. తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించేశాడు.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో..
చిన్న హీరోలతో కొత్త ప్రయోగాలు చేస్తోంది గీతా ఆర్ట్స్ 2 బ్యానర్. ఈ క్రమంలోనే కార్తికేయ హీరోగా చావు కబురు చల్లగా అనే చిత్రాన్ని ప్రారంభించింది. నేడు ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. కార్తికేయ్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది.
హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
చావు కబురు చల్లగా అనే ఈ చిత్రంలో కార్తికేయ సరసన హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. అయితే తాను అందాల రాక్షసి సినిమా అప్పటి నుంచి లావణ్య అంటే ఇష్టమని, తన అభిమానని చెప్పుకొచ్చాడు. ఓ ఫ్యాన్ నుంచి.. ఆమెతో నటించే వరకు ఎదగడం ఓ అఛీవ్‌మెంట్‌లా ఉందని కామెంట్ చేశాడు.

సో స్వీట్ అంటూ రిప్లై..
హీరో కార్తికేయ చేసిన ఈ ట్వీట్‌కు లావణ్య త్రిపాఠి రిప్లై ఇచ్చింది. సో స్వీట్ కార్తికేయ థ్యాంక్యూ.. నువ్వు ఈ చిత్రంలో అదిరిపోయేలా నటిస్తావ్.. నీతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చింది.
Recommended Video

ఆకట్టుకునే కథ..
చావు కబురు చల్లగా మూవీ గురించి లావణ్య చెబుతూ.. ఈ మూవీ స్క్రిప్ట్ చాలా బాగా ఉందని, ఇంత వరకు తాను విన్న కథల్లో ఇంత హాస్యంతో కూడుకున్నది లేదని, సినిమా బాగుంటుందని తెలిపింది. శవాలను తీసుకెళ్లే వెహికిల్ డ్రైవర్‌గా బస్తీ బాలరాజు అనే పాత్రలో కార్తీకేయ అదరగొట్టబోతోన్నాడని టాక్.


Click it and Unblock the Notifications











