శ్రీలీలాతో డేటింగ్.. స్పందించిన బాలీవుడ్ స్టార్.. ఇలా తేల్చేశాడు.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది. 'ఆషీకి3' అనే చిత్రంతో బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ శరవేగంగా పూర్తి అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. అందులో శ్రీలీలా కార్తీక్ ఆర్యన్ తో కలిసి రొమాన్స్ లో రెచ్చిపోయింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ముఖేశ్ భట్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది 2025 అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రచార కార్యక్రమాలను ఇప్పటి నుంచే ప్రారంభించారు. అయితే ఈ సినిమాలో నటిస్తున్న శ్రీలీలాలపై ఓ క్రేజీ రూమర్ పుట్టుకొచ్చింది. శ్రీలీలా ఆ మూవీ హీరో కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో మునిగి తేలుతోందని ప్రచారం జరిగింది. ఇక ఇటీవల వీరద్దరూ కలిసి ప్రమోషన్స్ కోసం తరుచుగా కనిపిస్తున్న సమయంలో మరింతగా డేటింగ్ రూమర్లు వ్యాప్తి చెందుతున్నాయి.

Karthik Aryan Sreeleela Dating Rumours

అయితే, తాజాగా ఈ డేటింగ్ రూమర్లపై బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని ఖండించారు. అవన్నీ అవాస్తవాలని వాటిని నమ్మవద్దని చెప్పినట్టు బాలీవుడ్ మీడియా చెబుతోంది. తను ఎవరితోనూ డేటింగ్ లో లేని, అది ఉట్టి డేటింగ్ బజ్ అని మాత్రమే అన్నారు. దాంతో శ్రీలీలాతో కార్తీక్ ఆర్యన్ డేటింగ్ రూమర్లకు అడ్డుకట్ట పడింది. వీరద్దరూ జస్ట్ సినిమా ప్రమోషన్స్ కోసమే కలిసి తిరుగుతున్నారని, ఆషీకి 3 సినిమాకు సంబంధించిన పనుల్లో భాగంగానే క్లోజ్ గా ఉన్నారని తెలుస్తోంది.

మొత్తానికి ఆషికీ ఫ్రాంచైజీలో రాబోతున్న మూడోవ పార్ట్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి మున్ముందు మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే నార్త్ లో కార్తీక్ ఆర్యన్, శ్రీలీలా గిటార్లు పట్టుకుని ఆడియెన్స్ ను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాలను మాత్రం షురూ చేశారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ఓ రొమాంటిక్ సాంగ్ ను వెస్ట్ బెంగాల్ లో షూట్ చేశారు. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. అయితే ఈ చిత్రానికి ఇంతవరకు అఫిషియల్ గా టైటిల్ ను అనౌన్స్ చేయలేదు. ఫ్యాన్స్ మాత్రం ఆషికీ3 అని పిలుచుకుంటున్నారు. కేవలం రొమాంటిక్ గ్లింప్స్ ను మాత్రమే వదిలారు.

కాగా, శ్రీలీలా బాలీవుడ్ లో తన తొలిచిత్రంతో ఎలా అలరిస్తుందో చూడాలి. ఇప్పటికే 'పుష్ప2'లో ఐటెం సాంగ్ లో నటించి తన సత్తా చూపించిన సంగతి తెలిసిందే. కిసిక్ పాటకు తన డ్యాన్స్ తో నార్త్ ఆడియెన్స్ లో క్రేజ్ దక్కించుకుంది. ఇక తెలుగు రీసెంట్ గా 'రాబిన్ హుడ్' తో అలరించింది. కానీ ఆ సినిమా ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే శ్రీలీలాకు ఇటీవల పెద్దగా హిట్లు పడటం లేదు. కొత్త హీరోయిన్ల సందడి పెరుగుతుండటంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు తగ్గుతున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X