గేమ్ ఛేంజర్ ను భ్రష్టు పట్టించింది వాళ్ళే.. రామ్ చరణ్ కు శంకర్ వెన్నుపోటు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా చెర్రీకి గుర్తింపు దక్కింది. రామ్ చరణ్ నటనకు హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కామెరూన్ వంటి ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు. ప్రశంసలు కురిపించారు. దాంతో చరణ్ నుంచి రాబోయే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తమిళ అగ్ర దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలై పరాజయాన్ని అందుకుంది. చరణ్ పెర్ఫామెన్స్ మినహా ఏదీ ప్రేక్షకులకు ఆనలేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గేమ్ ఛేంజర్ చిత్రాన్ని రూ.350 కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చించి నిర్మించారు. కాగా బాక్సాఫీస్ నుంచి కేవలం రూ.178 కోట్ల గ్రాస్ మాత్రమే తిరిగి రాబట్టగలిగింది. అది కూడా రామ్ చరణ్ పెర్ఫామెన్స్ కు ప్రేక్షకులు థియేటర్ల వద్దకు వెళ్లారని, సినిమా కథ ఏమీ బాలేదని అప్పుడు అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఫెల్యూర్ పైనా కొద్ది రోజులు చర్చ నడిచింది. దర్శకత్వం, రైటర్, నటన, నిర్మాత విషయంలో అందరూ ఉద్దండులే ఉన్నప్పటికీ సినిమా విషయంలో లోపం ఎక్కడ జరిగిందనేది చర్చగా మారింది. అదే సమయంలో ఒకరిపై మరొకరు సినిమా ఫెల్యూర్ ను నెట్టుకున్న పరిస్థితి కనిపించింది.

ఏదేమైనా తమ అభిమాన హీరో రామ్ చరణ్ కు మాత్రం భారీగానే డ్యామేజ్ జరిగందని ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా పరాజయానికి అసలు కారణం ఏంటో తమిళ దర్శకుడు, గేమ్ ఛేంజర్ సినిమా రైటర్ కార్తీక్ సుబ్బరాజ్ బయట పెట్టారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అసలు గేమ్ ఛేంజర్ సినిమాకు నేను ఇచ్చిన కథ వేరు. నేను శంకర్ సార్ కు కథను అందించినప్పుడు అది పూర్తిగా ఐఏఎస్ ఆఫీసర్ కు సంబంధించిన కథగా ఉండింది. కానీ తర్వాత కథలో చాలా మార్పులు జరిగాయి.
మరికొందరు రైటర్స్ నేను ఇచ్చిన కథలో చాలా మార్పులు చేశారు. దాంతో అసలు కథకు ఉన్న ప్రాణం పోయింది. అలాగే స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా మారిపోయింది... అని కార్తీక్ సుబ్బరాజ్ వివరించారు. కార్తీక్ సుబ్బరాజ్ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాను భ్రష్టు పట్టించింది ఆ రైటర్సేనని తెలియడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనప్పటికీ శంకర్ ను నమ్మడం వల్ల తమ అభిమాన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు వెన్ను పోటు పొడిచాడని అంటున్నారు. ఇక కార్తీక్ సుబ్బరాజు డైరెక్టర్ గా పిజ్జా, జిగర్తాండ, పేట, మహాన్ వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం సూర్య తో రెట్రో సినిమాను తీసుకొస్తున్నారు. మే1న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఆ తర్వాత తమిళ స్టార్ అజిత్ కుమార్ 64వ చిత్రాన్ని కూడా ఆయనే డైరెక్ట్ చేయబోతుండటం విశేషం.


Click it and Unblock the Notifications











