twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కార్తీక దీపం హీరోకు చిరంజీవి తల్లి అరుదైన గిఫ్ట్.. ప్రేమతో ఏం పంపారో తెలుసా?

    |

    తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనమైన టీఆర్పీని సాధించిన డైలీ సీరియల్ కార్తీక దీపం. అత్యంత ప్రేక్షకదారణ ఉన్న సీరియల్‌‌గా ఓ క్రేజ్‌ను సంపాదించుకొన్నది. ఈ సిరియల్‌కు సాధారణ ప్రేక్షకులే కాకుండా టాప్ సెలబ్రిటీల కుటుంబాలు కూడా అభిమానులుగా మారిపోయారనేది పలు సందర్భాల్లో రుజువైంది. తాజాగా కార్తీక దీపం చిత్రంలో నటించిన పరిటాల నిరుపమ్ అలియాస్ డాక్టర్‌కు బాబుకు అరుదైన బహుమతిని అందుకొన్నారు. బహుమతి వెనుక ఉన్ కథలోకి వెళ్తే..

    Recommended Video

    Karthika Deepam fame Nirupam AKA Karthik Got gift from Chiranjeevi's Mother Anjana Devi
    లాక్‌డౌన్‌లో కూడా టాప్ రేటింగ్

    లాక్‌డౌన్‌లో కూడా టాప్ రేటింగ్

    లాక్‌డౌన్ సమయంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాకుండా టెలివిజన్ ఇండస్ట్రీ కూడా మూతపడింది. దాంతో డైలీ సీరియల్స్‌ను నిరవధికంగా ఆపేశారు. అయితే వాటి స్థానంలో పాత ఎపిసోడ్స్‌ను రిపీట్ టెలికాస్ట్ చేశారు. అయితే రిపీట్ టెలికాస్ట్‌కు కూడా విశేష ప్రేక్షకదారణ దొరకడం గమనార్హం. రిపీట్ టెలికాస్ట్‌లో కూడా ఇతర కార్యక్రమాలను ఎదురించి టాప్ 5 స్థానంలో కార్తీక దీపం సీరియల్ నిలువడం గమనార్హం.

    కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్‌కు పిచ్చ క్రేజ్

    కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్‌కు పిచ్చ క్రేజ్

    కార్తీక దీపంలో నటించిన వారందరిలో అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్. నిరుపమ్ క్రేజ్ ఎంత ఉందంటే.. ఆయన సొంత పేరు చెప్పినా గుర్తుపట్టనంతగా ఉంటుంది. అత్యధికంగా అభిమానులు, ప్రేక్షకులు పాత్ర పేరు కార్తీక్‌తోనే గుర్తిస్తారు. పుట్టినప్పుడు పెట్టిన పేరును కూడా మార్చేసేంత కార్తీక దీపం ఆయన జీవితంలో ప్రభావం చూపింది. ఆయనకు ఉన్నా అభిమానుల్లో మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా అంటే ఆశ్చర్యం కలుగకమానదు.

    నిరుపమ్‌కు అంజనాదేవి బహుమతి

    నిరుపమ్‌కు అంజనాదేవి బహుమతి

    తాజాగా కార్తీక్‌ అలియాస్‌ నిరుపమ్‌కు చిరంజీవి తల్లి అంజనాదేవి గారు తియ్యని బహుమానాన్ని ప్రేమతో స్వయంగా పంపించారు. మామిడి పండ్ల బుట్టను ప్రత్యేకంగా నిరుపమ్ కోసం పంపించి తన అభిమానాన్ని చాటుకొన్నారు. దాంతో నిరుపమ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాను మెగాస్టార్ తల్లి నుంచి మామిడి పండ్లను బహుమతిగా అందుకోవడం మరిచిపోలేని మెమొరీగా మార్చేసిందని తన సంతోషాన్ని సన్నిహితులతో పంచుకొంటున్నారు.

    సెలబ్రిటీల ఫ్యామిలీలు కూడా

    సెలబ్రిటీల ఫ్యామిలీలు కూడా

    ఇక నిరుపమ్‌కు అభిమానులుగా మారిన వాళ్లలో పరుచూరి గోపాలకృష్ణ, బ్రహ్మానందం కుటుంబాలు కూడా ఉన్నాయి. తన భార్యకు కార్తీక దీపం సీరియల్ అన్నా.. నిరుపమ్ నటన అంటే తన భార్యకు చాలా ఇష్టమని పరుచూరి చెప్పుకొచ్చారు. అలాగే బ్రహ్మానందం కూడా ఓ సందర్భంలో స్వయంగా గుర్తించి నిరుపమ్‌ను అభినందించారట.

    సోషల్ మీడియాలో కూడా విశేషమైన క్రేజ్

    సోషల్ మీడియాలో కూడా విశేషమైన క్రేజ్

    ఇక కార్తీక దీపం సిరియల్‌కు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. టిక్ టాక్‌లో మాత్రం ఇక చెప్పనక్కర్లేదు. వందలాది వీడియోలు టిక్ టాక్‌లో హోరెత్తిస్తుంటాయి. ఎప్పుడూ ఈ సిరియల్‌కు సంబంధించిన చాలా వీడియోలు ట్రెండింగ్‌లో ఉంటాయి.

    నన్ను కార్తీక్ అని పిలుస్తుంటారని

    నన్ను కార్తీక్ అని పిలుస్తుంటారని

    కార్తీక దీపం సీరియల్‌లో తన నటనకు వస్తున్న ప్రేక్షకాదరణతో నిరుపమ్ హ్యాపీగా ఫీలవుతుంటాడు. ఓ సందర్భంలో మాట్లాడుతూ.. నన్ను నిరుపమ్ అంటే ఎవరూ గుర్తుపట్టడం లేదు. చాలా మంది నన్ను కార్తీక్‌గానే గుర్తిస్తున్నారు. కార్తీక్ పేరు తనకు బాగా సూట్ అయిందని చెప్పుతుంటారు. ఇప్పుడు నా పేరు నిరుపమ్ కార్తీక్ పరిటాలగా మారిపోయింది అని ఆనందంలో పడిపోయారు.

    English summary
    Karthika Deepam fame Nirupam Paritala gets a precious gift from Chiranjeevi's mother Anjana Devi. He was so happy for the gift from Mega Family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X