మొదలైన కార్తికేయ 2.. కాన్సెప్ట్ వీడియో రిలీజ్
యంగ్ హీరో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వల్ ప్లాన్ చేశాడు డైరెక్టర్ చందు మొండేటి.
ఈ మేరకు కార్తికేయ 2 సినిమాను ప్రారంభించాడు. 'అర్జున్ సురవరం' సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నిఖిల్ తిరిగి కార్తికేయ 2 లో నటించనున్నాడు. మార్చి 2న తిరుమల శ్రీవారి సన్నిధిలో పూజాకార్యక్రమాలు జరుపుకున్న అనంతరం షూటింగ్ ప్రారంభిస్తామని చిత్రబృందం తెలిపింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాయి. అగ్రనిర్మాతలు టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసి ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో ఎంతో ఆసక్తికరంగా ఉండి కార్తికేయ 2 పై అంచనాలు రేకెత్తించింది. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక విభాగం గురించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











