శ్రీవారి సన్నిధిలో 'కార్తికేయ 2' స్టార్ట్.. లావణ్య త్రిపాఠి రియాక్షన్‌లో అర్థమేంటి?

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా రూపొంది సక్సెస్ సాధించిన 'కార్తికేయ' మ్యాజిక్‌ మరోసారి రిపీట్ కాబోతోంది. 'కార్తికేయ 2' పేరుతో ఈ సినిమాను రూపొందించబోతున్నారు డైరెక్టర్ చందు మొండేటి. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించనున్నారు. ఈ రోజు (మార్చి 2) ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు మేకర్స్.

తిరుమల తిరుపతి దేవస్థానం పరిసరాల్లో ఈ సినిమాను ప్రారంభించి.. ముహూర్తపు షాట్ చిత్రీకరించారు. ఈ మేరకు ఆ విషయాన్ని తెలుపుతూ, మూవీ ఓపెనింగ్ ఫొటోలను ట్వీట్ చేశాడు హీరో నిఖిల్. ఈ ట్వీట్ చూసిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి దాన్ని రీ ట్వీట్ చేస్తూ హీరో నిఖిల్‌కి, డైరెక్టర్ చందు మొండేటికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. దీంతో ఇప్పటిదాకా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారా? అనే సందేహానికి చిన్న క్లూ దొరికినట్లయింది. 'కార్తికేయ 2' జోడీగా లావణ్య నటిస్తుందని ఫిక్స్ అవుతున్నారంతా.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాయి. అగ్రనిర్మాతలు టిజి విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసి ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Karthikeya 2 start: Lavanya Tripathi Interesting Tweet

నిన్న (మార్చి 1) కార్తికేయ 2 కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో ఎంతో ఆసక్తికరంగా ఉండి సినిమాపై ఆసక్తి రేకెత్తించింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక విభాగం గురించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనున్నారు యూనిట్ సభ్యులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X