అన్ని రకాల ఎమోషన్స్‌తో కూడిన 90 ML.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్
టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి ఎంతటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. కొత్త ఒరవడిని సృష్టించిన అర్జున్ రెడ్డి మాదిరిగానే ఆర్ఎక్స్ 100 సినిమా అందర్నీ ఆశ్చర్యపరిచింది. సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను పలకరించిన కార్తికేయ యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు. అటుపై కార్తికేయ హిప్పీ, గుణ 369లాంటి చిత్రాలతో పలకరించి మంచి విజయాలను అందుకున్నాడు.
ఇక తాజాగా 90 ML అంటూ మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. పోస్టర్స్‌తోనే అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్.. పాటలతో భారీ హైప్ క్రియేట్ చేశారు. ఈ మూవీ కోసం కొత్త కొత్త లొకేషన్లలో షూట్ చేశారు. విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్రయూనిట్ చాలా కష్టపడినట్టు తెలుస్తోంది. ఆ మధ్య ఈ మూవీ నుంచి టీజర్ విడుదల కాగా అది ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా 90 ML మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది యూనిట్.

నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది.. నాతో కలిసి బతకాలనే ఆలోచనే లేదు.. అంటూ హీరోయిన్ ఎంతో ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. కొందరికి మందు తాగడం సరదా.. కొందరికి అది వ్యసనం.. నీ కొడుక్కు అది అవసరం అంటూ డాక్టర్ చెప్పడంతో కార్తికేయకు ఉండే సమస్య ఏంటో చిన్న క్లూ ఇచ్చేశారు. మూడు పూటలా మూడు 90 ML తాగాలంటూ కార్తికేయ చెప్పడం.. ఏ జన్మలో ఏ యాగం చేశారో.. ఈ జన్మలో ఈ యోగంతో పుట్టాడంటూ సీనియర్ నటుడు సత్య ప్రకాశ్ కామెడీ క్రియేట్ చేయడం.. ఇది పుట్టినప్పుడు పాల కోసం ఏడ్చింది.
మళ్లీ ఇప్పుడు నీలాంటి తాగుబోతు కోసం ఏడుస్తోందని రావు రమేష్ అనడం .. ఒక్క రోజు మందు తాగకపోతే చచ్చిపోతావా? అవును చచ్చిపోతాను.. అయితే చావు.. అనే హీరోయిన్ డైలాగ్ ఇలా ఈ మూవీలో ప్రతీ ఒక్క ఎమోషన్ ఉందని చెప్పకనే చెప్పేసింది చిత్రబృందం. అశోక్ రెడ్డి ఎర్రా దర్శకత్వం వహించిన ఈ మూవీని అశోక్ రెడ్డి ఎర్రా నిర్మించారు. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











