యూరప్‌లో బ్యూటీతో RX 100 హీరో రొమాన్స్.. ప్రతీది రియలిస్టిక్‌గా!
'ఆర్ ఎక్స్ 100 ' మూవీతో తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడంతో పాటు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తికేయ. ఈ విజయం తర్వాత కార్తికేయకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీలో నటిస్తున్నాడు.
అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ తొలి షెడ్యూల్ ఒంగోలులో ముగిసింది. ఫస్ట్ షెడ్యూల్‌లో 40 శాతం షూటింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం వెల్లడించింది.

సినిమా గురించి దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ... వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుంది. చాలా మంది మనసులకు దగ్గరయ్యే మూవీ. కార్తికేయ పాత్ర యువతకు రెప్రజంటేషన్‌లాగా ఉంటుంది. యాక్షన్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ... కథ అద్భుతంగా ఉంటుంది. ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశాం. ప్రతి ఫ్రేమూ రియలిస్టిక్‌గా వచ్చిందన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ తొలి షెడ్యూల్ ఒంగోలులో 25 రోజుల్లో పూర్తి చేశాం. ఇక్కడి క్వారీలు, గ్రానైట్ ఫ్యాక్టరీలు, కాలనీలు, రిజర్వాయర్లలో షూటింగ్ చేశాం. కీలకమైన టాకీ పోర్షన్, ఒక పాట, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ పూర్తయింది. 40 శాతం షూటింగ్ ముగిసింది. మార్చి 5 నుంచి యూరప్‌లోని క్రొయోషియాలో రెండు పాటలను తెరకెక్కిస్తామన్నారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్, కెమరామెన్: 'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ రామ్, ఆర్ట్ డైరెక్టర్ : జీయమ్ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు ,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శివ మల్లాల.


Click it and Unblock the Notifications











