For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిరంజీవి, మహేష్ బాబుపై కార్తికేయ కామెంట్స్.. 90ML కాదు 900ML కిక్

|

Rx100 సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కార్తికేయ. ఈ సినిమాతో యూత్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ హీరో.. ఇప్పుడు సరికొత్త కిక్ ఇవ్వడానికి 90ML మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి యర్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. నేహా సోలంకి హిరోయిన్ గా నటించింది. లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్బంగా శనివారం చిత్ర‌ యూనిట్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది.

అజయ్ భూపతి చేతుల మీదుగా బిగ్ సీడీ

అజయ్ భూపతి చేతుల మీదుగా బిగ్ సీడీ

ఈ వేడుకలో డైరెక్టర్ అజయ్ భూపతి సినిమా బిగ్ సీడీని లాంచ్ చేశారు.సినీ ప్రముఖులు సందీప్ కిషన్, జానీ మాస్టర్, రోల్ రిడా, తాగుబోతు రమేష్, విఠల్ రెడ్డి, రజిని, వంటి ప్రముఖులు పాల్గొన్నారు. సందడి సందడిగా సాగిన ఈ వేడుకలో డాన్సులు, కార్తికేయ ముచ్చట్లు ఆకట్టుకున్నాయి.

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి సెట్ అవుతుందని అన్నారు

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి సెట్ అవుతుందని అన్నారు

ఈ సందర్బంగా అజయ్ భూపతి మాట్లాడుతూ.. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ నా కోసమే పుట్టింది. RX100 మూవీతో మంచి హిట్ అందుకున్నాము. ఇప్పుడు 90ML కూడా మరో సక్సెస్ సాధించి ప్రొడ్యూసర్‌కి మంచి లాభాలు అందించాలని కోరుకుంటున్నా. Rx100 ట్రైలర్ రిలీజ్ కాగానే ఈ సినిమా డైరెక్టర్ శేఖర్ ఫోన్ చేసి 90ML కథ అతనికి కరెక్ట్‌గా సెట్ అవుతుందని చెప్పి ఫస్టాఫ్ చెప్పారు. మా సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత మళ్ళీ కార్తికేయ గుర్తుపెట్టుకొని ఈ కథ సెకండాఫ్ విని ఒకే చేశాడు. ఈ నెల 5న అందరు థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి. చిత్ర యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్. కార్తికేయతో మరో సినిమా తప్పకుండా చేస్తా'' అన్నారు.

వెటర్నరీ డాక్టర్ హత్య గురించి మాట్లాడిన యంగ్ హీరో

వెటర్నరీ డాక్టర్ హత్య గురించి మాట్లాడిన యంగ్ హీరో

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ''నిన్న ఒకరోజు మొత్తం నాలో చాలా కోపం వచ్చింది. ప్రియాంక రెడ్డి ఘటన నన్ను చాలా కలచివేసింది. ముందుగా ఆమె కోసం పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి నిరసనలు తెలిపిన జనాలను ప్రశంసించి తీరాలి. ఇక సినిమా విషయానికి వస్తే.. నాకు ఒక మంచి తమ్ముడు లాంటి వ్యక్తి కార్తికేయ. పర్సనల్ లైఫ్‌లో ఎన్నో విషయాల్లో నన్ను ఆకర్షించారు. చాలా కష్టపడే వ్యక్తి. అతనికి ఈ సినిమా మాంచి గుర్తింపు తేవాలని కోరుకుంటున్నా'' అన్నాడు.

ప్రతి సీన్‌లో కార్తికేయ.. హీరోయిన్ కామెంట్స్

ప్రతి సీన్‌లో కార్తికేయ.. హీరోయిన్ కామెంట్స్

హీరోయిన్ నేహా సోలంకీ మాట్లాడుతూ.. ''అందరికీ నమస్కారం. ముందుగా డైరెక్టర్ శేఖర్ రెడ్డిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. 90ML లాంటి మంచి కథను రాసి అందులో నన్ను హీరోయిన్ పాత్రకు సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నిర్మాత అశోక్ రెడ్డి గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. హీరో కార్తికేయ ప్రతి సీన్‌లో సపోర్ట్ చేసినందుకు స్పెషల్‌గా థ్యాంక్స్ చెబుతున్నా. మరోసారి అతనితో వర్క్ చేయాలని ఉంది'' అన్నారు.

రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ..

రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ..

''వేడుకలో ఒక సింగర్‌గా నాకు మంచి గౌరవం దక్కింది. అంతా అభిమానుల దయవల్లే. కార్తికేయ బ్రదర్‌కి చాలా సింపుల్‌గా ఉండే వ్యక్తి. అతనికి ఈ మూవీ కెరీర్ లోనే బెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇక ఈ సినిమాలో రెండు పాటలు నాతో పాడించిన అనూప్ రూబెన్స్ గారికి చాలా కృతజ్ఞతలు. నాకు మొదటి అవకాశం ఇచ్చింది కూడా ఆయనే. చిత్రయూనిట్ కి ఆల్ ది బెస్ట్'' అన్నాడు.

#CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
నా దృష్టిలో వాళ్ళే నిజమైన హీరోలు

నా దృష్టిలో వాళ్ళే నిజమైన హీరోలు

హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ''ఇదొక ఫ్యామిలీ ఈవెంట్‌లా ఉంది. ఇంతగా సపోర్ట్ ఇచ్చిన అభిమానులకు ముందుగా నా ప్రత్యేక కృతజ్ఞతలు. మొదట దర్శకుడు శేఖర్ వేరే కథ చెప్పారు. ఆ తరువాత ఫస్టాఫ్ వరకు సెట్ చేసుకున్న 90ML అనే కథ చెప్పారు. మందు తాగకపోతే బ్రతకని ఒక వ్యక్తి అలాగే మందు వాసన అంటే పడని ఒక తండ్రి యొక్క కూతురికి మధ్య నడిచే లవ్ స్టోరీ అనగానే నాకు బాగా నచ్చేసింది. ఒకరోజు ఫోన్ చేసి 90ML టైటిల్ అనగానే డిఫరెంట్‌గా అనిపించింది. అప్పుడే మంచి బడ్జెట్‌లో సినిమాను నిర్మించాలని సొంతంగా మా హోమ్ బ్యానర్ లో సినిమాని నిర్మించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసి హీరో అవ్వాలని అనుకున్నా. నా దృష్టిలో మెగాస్టార్, మహేష్ నిజమైన హీరోలు. వారే నాకు స్ఫూర్తి. ఫైనల్‌గా డిసెంబర్ 5న మా సినిమాతో 90ML కాదు.. 900ML కిక్ వస్తది. ఈ సినిమా ఆల్కహాలిక్‌ని ప్రోత్సహించదు'' అన్నాడు.

English summary
After Rx 100 Karthikeya Not got a success. Now he was ready to take a success from 90ML movie. This movie pre release event done in Hyderabad. In this event Karthikeya commented Chiranjeevi.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more