కార్తీకేయపై చిరంజీవి ప్రశంసల వర్షం.. సిక్స్‌ప్యాక్ గురించి స్వయంగా మెగాస్టార్ మెసేజ్
కరోనావైరస్‌తో పరిశ్రమ స్తంభించడంతో నటీనటులు, హీరో, హీరోయిన్లు ఇంటికే పరిమితమయ్యారు. లాక్‌డౌన్ సమయాన్ని పలు రకాలుగా ఉపయోగించుకొనేందుకు సిద్ధమయ్యారు. అయితే RX100 ఫేమ్ హీరో కార్తీకేయ గుమ్మకొండ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసే విధంగా సిక్స్‌ప్యాక్‌తో అభిమానుల ముందుకొచ్చారు. ఈ సందర్భంగా కార్తీకేమ మాట్లాడుతూ..
లాక్‌డౌన్ కారణంగా కలిసి వచ్చిన సమయాన్ని నేను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలనుకొన్నాను. మొదటి నుంచి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడం చేస్తుంటాను. ఈ లాక్‌డౌన్‌ను గొప్ప ఉపయోగించుకోవాలని నాకు నేను అనుకొన్నాను. అందుకే స్పెషల్ ట్రైనర్ సహాయంపై శారీరక ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకొన్నాను.

సిక్స్ ప్యాక్ కోసం పలు రకాల కార్డియో వాస్కులర్, ఇతర ఎక్సర్‌సైజులు చేశాను. ఎక్కువ మొత్తంలో వెయిట్ సంబంధించి కసరత్తులు చేశారు. నేను పడిన కష్టానికి మంచి ప్రతిఫలం దక్కింది. నెటిజన్లు నుంచి మంచి రెస్పాన్స్ లభించడం నాకు చాలా సంతృప్తినిచ్చింది అని కార్తీకేయ చెప్పారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి నుంచి నాకు ప్రశంసలు రావడం జీవితంలో మరిచిపోలేనిది. నాకు చిరంజీవి గారు ఓ మెసేజ్ పంపించారు. వాట్ ఏ ట్రాన్స్‌ఫర్మేషన్, నేను ఊహించని విధంగా ఉంది. నీ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి సంతోషంలో మునిగిపోయానని మెగాస్టార్ అన్నారు అని కార్తీకేయ తెలిపారు.
ప్రస్తుతం కార్తీకేయ గీతా ఆర్ట్స్ రూపొందించే చావు కబురు చల్లగా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు.


Click it and Unblock the Notifications











