twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #RajaVikramarka : ఎన్ఐఏ ఆఫీసర్ గా ఆసక్తి రేకెత్తిస్తున్న కార్తికేయ లుక్.. ఆ స్టార్ హీరో మనవరాలితో!

    |

    ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ ఎట్టకేలకు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఆయన సినిమా చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటన వెలువడింది. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితమే అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. రాజ విక్రమార్క అనే టైటిల్ తో కార్తికేయ ఆఫీస్ టేబుల్ పక్కన పడుకుని పైకి చూస్తున్నట్టుగా ఉన్న ఫస్ట్ లుక్ ఆసక్తి రేకెత్తిస్తోంది.

    శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో మొట్ట మొదటి సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అలాగే సుధాకర్ కొమకుల, పశుపతి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రామారెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కన్నడ భామ తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో కార్తికేయ ఒక ఎన్ ఐ ఏ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు గతంలోని హింట్ ఇచ్చారు.

    Karthikeya gummakondas Raja Vikramarka first look unveiled by sandeep reddy vanga

    రెండో దశ లాక్ డౌన్ మొదలు కాక ముందే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇక ఇప్పుడు షూటింగ్ కి మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ షూటింగ్ మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, ఫ్యామిలీ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

    మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆమె తాత రవిచంద్రన్ చిరంజీవి కలిసి కన్నడ తెలుగు బైలింగ్యువాల్ మూవీ కూడా ఒకటి చేశారు. కన్నడ, తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేసిన ఈ భామ కార్తికేయ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

    English summary
    Karthikeya gummakonda's new movie with debutant sri saripalli Raja Vikramarka first look and title unveiled by sandeep reddy vanga shortly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X