చావు కబురు చల్లగా చెప్పిన కార్తికేయ.. బస్తీ బాలరాజుగా మాస్ లుక్‌లో
ఆర్ ఎక్స్ 100 చిత్రంతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ.. భగ్న ప్రేమికుడి నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆపై యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మాస్ సినిమాలను పట్టాలెక్కిస్తూ అందర్నీ మెప్పిస్తున్నాడు. రీసెంట్‌గా 90 ఎమ్ ఎల్ అంటూ ఆడియెన్స్‌ను పలకరించాడు. డ్యాన్సులు, కామెడీ, యాక్షన్ సీన్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు. తాజాగా మరో చిత్రాన్ని కూడా ప్రారంభించేసి ఓ అప్‌డేట్ ఇచ్చేశాడు.
యంగ్ హీరోలను, టాలెంట్ ఉన్న వారిని గీతా ఆర్ట్స్ 2 అవకాశాలు ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్‌లో ఇప్పటికే నాగచైతన్య.. విజయ్ దేవరకొండ లాంటి హీరోలకు బ్లాక్ బస్టర్ విజయాల్ని అందించింది. ప్రస్తుతం అఖిల్‌తో కూడా ఓ సినిమాను నిర్మిస్తోంది. అఖిల్- బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ చిత్రం సెట్స్‌పై ఉంది.

ఈ క్రమంలో మరో యంగ్ సెన్సేషన్ కార్తీకేయకు కూడా గీతా ఆర్ట్స్ 2 నుంచి పిలుపు వచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్ని వాసు నిర్మాతగా కార్తికేయ హీరోగా చావు కబురు చల్లగా..! అనే చిత్రాన్ని ప్రకటించారు. కార్తికేయ ఈ చిత్రంలో బస్తీ బాలరాజుగా నటించబోతున్నాడు. బన్నీవాసుతో పాటు కౌశిక్.పి- సునీల్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











