twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కార్తికేయ నెక్ట్స్ మూవీకి ఎవరూ ఊహించని టైటిల్!

    |

    'ఆర్ఎక్స్ 100' ఫేం కార్తికేయ త్వరలో మరో భిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'ఆర్ఎక్స్ 100' మూవీ నిర్మించి కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బేనర్లో ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ సినిమా రాబోతోంది. దీనికి '90 ఎంఎల్' అనే టైటిల్ ఖరారు చేస్తూ సోమవారం పోస్టర్ రిలీజ్ చేశారు.

    చుట్టూ మందు సీసాల మధ్య కార్తికేయ కూర్చుని డిఫరెంటుగా ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అశోక్ రెడ్డి నిర్మాత. శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. రెండు రోజుల క్రితం ఈ సినిమా ప్రీ పోస్టర్ రిలీజ్ చేసినపుడు పాల సీసాలో మందు, దాన్ని పట్టుకోవడానికి పసివాడు ప్రయత్నిస్తున్న చూపించారు.

    Karthikeya next movie title 90ML

    ప్రీ పోస్టర్, పస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే... సినిమా అంతా కూడా మద్యం అలవాటు, యువతకు సంబంధించిన అంశాలతో సాగుతుందని స్పష్టమవుతోంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరు? ఇంతర వివరాలు ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.

    గతంలో 90ఎంఎల్ పేరుతో తమిళంలో ఓవియా ప్రధాన పాత్రలో తమిళంలో ఓ మూవీ వచ్చింది. అయితే ఈ మూవీ తెలుగులో రిలీజ్ ప్లాన్ చేశారు కానీ ఎందుకో ఆగిపోయింది. మరి ఈ సినిమాకు, ఆ సినిమాకు ఏమైనా లింకు ఉందా? ఈ టైటిల్ పెట్టడానికి కారణమేంటి అనేది తెలియాల్సి ఉంది.

    'ఆర్ఎక్స్ 100' విజయం తర్వాత కార్తికేయ హిప్పి, గుణ 369 చిత్రాలు చేశారు. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో '90 ఎంఎల్' మూవీ కథ విభిన్నంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Karthikeya next movie title 90ML. This is a Production No 2 of Kartikeya Creative Works, Makers of RX100. Shekhar will directs this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X