ఫ్యాన్సీ ధర పలికిన 90ML.. డిమాండ్ భారీ గానే ఉందే!

తొలి సినిమా Rx100 తోనే విజయం సాధించి కెరీర్‌‌కి సూపర్ ఓపెనింగ్ ఇచ్చాడు హీరో కార్తికేయ. ఆ తర్వాత కూడా హిప్పీ లాంటి సినిమాతో తనదైన నటన కనబర్చి యువతకు క్రేజీ హీరోగా మారాడు. దీంతో ఆయనకు వరుస సినిమా అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్తికేయ చేసిన తాజా సినిమా 90ML.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 5వ తేదీన 90ML సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదలైన 90ML సాంగ్స్, ఇతర అప్‌డేట్స్ ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయడంతో భారీ డిమాండ్ ఏర్పడింది.

Karthikeyas 90ML Demand.. Theatrical Rights Sold By

దీంతో 90ML థియేట్రికల్ రైట్స్ తీసుకోవడానికి పలు సంస్థలు పోటీపడ్డాయని తెలిసింది. చివరకు ఫ్యాన్సీ రేటు చెల్లించి శ్రీ వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తోంది.

కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై ఎర్రా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అశోక్ గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. చిత్రం అంతా వినోదాత్మకంగా సాగుతుందని యూనిట్ చెబుతోంది. రీసెంట్‌గా అజర్‌బైజాన్‌లో మూడు పాటలు చిత్రీకరించారు. ఆ పాటలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సినిమాతో కార్తికేయ అభిమానులకు మరో కిక్కివ్వబోతున్నామని అంటోంది చిత్రయూనిట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X