కార్తికేయ 90ML.. రిలీజ్ డేట్ ఫిక్స్

ఓ హీరోగా కెరీర్‌లో తొలి సినిమాతోనే విజయం సాధించడం, పాపులారిటీ తెచ్చుకోవడం అనేది చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు కార్తికేయ. Rx100 సినిమాతో తెలుగు తెరపై కాలుమోపి యువత మనసు దోచేసిన ఆయన.. వరుస సినిమా అవకాశాలు పట్టేస్తూ క్రమంగా తన టాలెంట్ బయట పెడుతున్నాడు కార్తికేయ. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న తాజా సినిమా 90ML.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. డిసెంబర్ 5వ తేదీన 90ML సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లుగా పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ఇతర అప్‌డేట్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.

శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 90ML చిత్రంలో కార్తికేయ రోల్ ప్రత్యేక ఆకర్షణ కానుందని తెలుస్తోంది. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అశోక్ గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. చిత్రంలో కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్‌గా నటిప్తోంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ చిత్రంపై యువత భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

Karthikeyas 90ML Release date Fixed

90ML అనే టైటిల్‌కి తగ్గట్టుగానే వైవిధ్యభరితమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రం అంతా వినోదాత్మకంగా సాగుతుందని యూనిట్ చెబుతోంది. రీసెంట్‌గా అజర్‌బైజాన్‌లో మూడు పాటలు చిత్రీకరించారు. ఆ పాటలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే 90MLతో ప్రేక్షకులకు కార్తికేయ మాంచి కిక్కివ్వనున్నాడని అర్ధం చేసుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X