For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంటనే రియాక్ట్ అయ్యా.. నచ్చని వాళ్లకు కూడా నచ్చేస్తా.. కార్తికేయ

    |

    ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ సంపాదించిన కార్తికేయ తాజా సినిమా గుణ 369. ఆగస్టు 2 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో నిన్న (సోమవారం) ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా హాజరై సందడి చేశారు. కార్యక్రమంలో హీరో కార్తికేయ స్పీచ్ ఆకట్టుకుంది. కార్తికేయ మాట్లాడుతూ..

    ఆర్‌ఎక్స్ 100 ఎఫెక్ట్ ఇంత ఉంటుందని ఊహించలేదు

    ఆర్‌ఎక్స్ 100 ఎఫెక్ట్ ఇంత ఉంటుందని ఊహించలేదు

    మొదటి సినిమా ఆర్‌ఎక్స్ 100 ఇంత హిట్ అవుతుందని, నాకు ఇంత పేరొస్తుందని ఊహించలేదు. అదంతా సడెన్ గా జరిగిపోయింది. దీంతో కొన్ని వందల మంది యాక్టింగ్, సినిమా సెలక్షన్ విషయంలో సూచనలు ఇవ్వడం ప్రారంభించారు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆ సజ్జెషన్స్ తీసుకుంటూ సినిమా సెలెక్ట్ చేసుకుంటున్నాను.

    వెంటనే రియాక్ట్ అయ్యా

    వెంటనే రియాక్ట్ అయ్యా

    నేను ఏ కథను ఒప్పుకోవాలనే కన్ఫూజన్ లో ఉన్న సమయంలో మల్యా గారు వచ్చి ఈ కథ వినిపించారు. బోయపాటి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు కాబట్టి అంత స్కేల్ లో కథ ఉంటుందేమో, మనకు సెట్ అవుతుందో లేదో అనుకున్నా. కానీ కథ స్టార్ట్ చేసి 20 నిమిషాలు పూర్తి కాగానే ఈ సినిమా డెఫినెట్ గా నేనే చేస్తున్నాను అని చెప్పేశా. కథ వినగానే ఇమ్మిడియట్ గా రిఫ్లెక్ట్ యాక్షన్ తీసుకొని ఓకే చెప్పేశా.

    అద్భుతాలు అనేవి లెక్కలేసుకుంటే జరగవు

    అద్భుతాలు అనేవి లెక్కలేసుకుంటే జరగవు

    ఈ సినిమాకు ఇంత బజ్ క్రియేట్ అవుతుందని ఆ రోజు తెలియదు. కానీ ఈ సినిమా పూర్తయ్యాక నన్ను నేను స్క్రీన్ పై చూసుకుంటే తెలిసింది.. 'అద్భుతాలు అనేవి లెక్కలేసుకుంటే జరగవు.. అలా అనిపిస్తే జరుగుతాయని'. ఈ సినిమా చూశాక తెలిసింది ఆ రోజు తీసుకున్న ఆ నిర్ణయం ఎంత ఇంపాక్ట్ అయిందనేది. ఈ సినిమా చూశాక.. నన్ను నేను చూసుకొని గర్వపడ్డాను. ఈ సినిమా చూశాక నచ్చని వాళ్లకు కూడా నచ్చేస్తా.. కాన్ఫిడెంట్ గా చెబుతున్నా అని కార్తికేయ అన్నాడు.

    మహేష్ గురించి మాట్లాడుతూ

    మహేష్ గురించి మాట్లాడుతూ

    మహేష్.. నువ్వీ క్యారెక్టర్ చేస్తావో లేదో అని మొదట్లో డౌట్ ఉండేది. రంగస్థలం ఒక్కటే చూశాను.. కానీ రియల్ లైఫ్ లో నువ్వు ఇంత స్పీడ్ అని నాకు తెలియదు. ఈ సినిమా చూశాక ప్రేక్షకుల నుంచి నీకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది అని కార్తికేయ అన్నాడు.

    గుణ 369 మూవీ

    గుణ 369 మూవీ

    కార్తికేయ కెరీర్ లో మూడో ప్రాజెక్టుగా వస్తున్న సినిమా 'గుణ 369'. చిత్రంలో కార్తికేయ సరసన అనఘా హీరోయిన్‌గా నటించింది. స్పిన్ట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి.

    English summary
    Hero Karthikeya latest movie Guna 369. This project is undergone by Arjun jandyala direction. This is the third project for Karthikeya. Yeasterday this movie pre release event celebrated in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X