Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
వెంటనే రియాక్ట్ అయ్యా.. నచ్చని వాళ్లకు కూడా నచ్చేస్తా.. కార్తికేయ
ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ సంపాదించిన కార్తికేయ తాజా సినిమా గుణ 369. ఆగస్టు 2 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా హైదరాబాద్లో నిన్న (సోమవారం) ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా హాజరై సందడి చేశారు. కార్యక్రమంలో హీరో కార్తికేయ స్పీచ్ ఆకట్టుకుంది. కార్తికేయ మాట్లాడుతూ..
ఆర్ఎక్స్ 100 ఎఫెక్ట్ ఇంత ఉంటుందని ఊహించలేదు
మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 ఇంత హిట్ అవుతుందని, నాకు ఇంత పేరొస్తుందని ఊహించలేదు. అదంతా సడెన్ గా జరిగిపోయింది. దీంతో కొన్ని వందల మంది యాక్టింగ్, సినిమా సెలక్షన్ విషయంలో సూచనలు ఇవ్వడం ప్రారంభించారు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆ సజ్జెషన్స్ తీసుకుంటూ సినిమా సెలెక్ట్ చేసుకుంటున్నాను.
వెంటనే రియాక్ట్ అయ్యా
నేను ఏ కథను ఒప్పుకోవాలనే కన్ఫూజన్ లో ఉన్న సమయంలో మల్యా గారు వచ్చి ఈ కథ వినిపించారు. బోయపాటి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు కాబట్టి అంత స్కేల్ లో కథ ఉంటుందేమో, మనకు సెట్ అవుతుందో లేదో అనుకున్నా. కానీ కథ స్టార్ట్ చేసి 20 నిమిషాలు పూర్తి కాగానే ఈ సినిమా డెఫినెట్ గా నేనే చేస్తున్నాను అని చెప్పేశా. కథ వినగానే ఇమ్మిడియట్ గా రిఫ్లెక్ట్ యాక్షన్ తీసుకొని ఓకే చెప్పేశా.
అద్భుతాలు అనేవి లెక్కలేసుకుంటే జరగవు
ఈ సినిమాకు ఇంత బజ్ క్రియేట్ అవుతుందని ఆ రోజు తెలియదు. కానీ ఈ సినిమా పూర్తయ్యాక నన్ను నేను స్క్రీన్ పై చూసుకుంటే తెలిసింది.. 'అద్భుతాలు అనేవి లెక్కలేసుకుంటే జరగవు.. అలా అనిపిస్తే జరుగుతాయని'. ఈ సినిమా చూశాక తెలిసింది ఆ రోజు తీసుకున్న ఆ నిర్ణయం ఎంత ఇంపాక్ట్ అయిందనేది. ఈ సినిమా చూశాక.. నన్ను నేను చూసుకొని గర్వపడ్డాను. ఈ సినిమా చూశాక నచ్చని వాళ్లకు కూడా నచ్చేస్తా.. కాన్ఫిడెంట్ గా చెబుతున్నా అని కార్తికేయ అన్నాడు.
మహేష్ గురించి మాట్లాడుతూ
మహేష్.. నువ్వీ క్యారెక్టర్ చేస్తావో లేదో అని మొదట్లో డౌట్ ఉండేది. రంగస్థలం ఒక్కటే చూశాను.. కానీ రియల్ లైఫ్ లో నువ్వు ఇంత స్పీడ్ అని నాకు తెలియదు. ఈ సినిమా చూశాక ప్రేక్షకుల నుంచి నీకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది అని కార్తికేయ అన్నాడు.
గుణ 369 మూవీ
కార్తికేయ కెరీర్ లో మూడో ప్రాజెక్టుగా వస్తున్న సినిమా 'గుణ 369'. చిత్రంలో కార్తికేయ సరసన అనఘా హీరోయిన్గా నటించింది. స్పిన్ట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి.