చావు కబురు చల్లగా.. హీరోయిన్ ఫిక్స్! కార్తికేయకు భలే ఛాన్సులే..

యంగ్ హీరో కార్తికేయ 'చావు కబురు చల్లగా' చెప్పేసిన సంగతి తెలిసిందే. Rx100 సినిమాతో సక్సెస్ ఖాతాలో వేసుకున్న ఈ హీరో ఇటీవలి కాలంలో సరైన హిట్ సాధించలేకపోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని 'చావు కబురు చల్లగా' సినిమాను స్టార్ట్ చేశాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

యువదర్శకుడు కౌశిక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయ 'బస్తీ బాలరాజు' పాత్రలో నటిస్తున్నాడు. సినిమాకి జాక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల చేసి ఆసక్తి రేపింది చిత్రయూనిట్. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో కార్తికేయ ఊరమాస్ లుక్‌లో దర్శనమిచ్చాడు. గళ్ళ చొక్కా ధరించి, శవాలను స్మశానానికి తీసుకెళ్లే వాహనంపై నుంచుని దమ్ముకొడుతూ కనిపించాడు.

Karthikeyas Chaavu Kaburu Challaga: Heroine fix

కాగా ఈ సినిమా హీరోయిన్ ఎవరనేది మాత్రం సీక్రెట్‌గా ఉంచింది చిత్రయూనిట్. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఈ సినిమాలో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు. ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠి కూడా అఫిషియల్‌గా అనౌన్స్ చేసింది. 'చావు కబురు చల్లగా' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నానని తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది లావణ్య త్రిపాఠి. ఈమె కూడా కెరీర్ గాడిలో వేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టి తీరుతుంది. అంటే ఈ 'చావు కబురు చల్లగా' సినిమా విజయం కోసం లావణ్య బలం కూడా తోడవుతుంది కాబట్టి ఒకరకంగా ఇది కార్తికేయ మాంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ ఇద్దరూ కలిసి విడుదల తర్వాత ఏ కబురు చెబుతారనేది!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X