షెట్టర్ క్లోజ్ చేసి అమ్మాయితో హీరో కార్తికేయ.. టీజర్ వైరల్

ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ హీరోగా రూపుదిద్దుకుంటున్న కొత్త సినిమా 'గుణ 369'. కార్తికేయ కెరీర్ లో మూడో ప్రాజెక్టుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. స్పిన్ట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చింతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. చిత్రంలో కార్తికేయ డిఫెరెంట్ లుక్ లో దర్శనమీయనున్నాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

లవ్, యాక్షన్, ఎమోషన్‌కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ యువతను బాగా ఆకట్టుకుంటోంది. టీజర్‌లో ఫ్రెష్ లుక్‌లో దర్శనమిచ్చిన కార్తికేయ లవ్, యాక్షన్ ఎపిసోడ్స్‌లతో తన విశ్వరూపం చూపించాడు. హీరోయిన్‌ని లోపలి తీసుకెళ్లి షెట్టర్ క్లోజ్ చేసి కార్తికేయ చెప్పిన డైలాగ్ హైలైట్ అవుతోంది. హీరో హీరోయిన్ మధ్య షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు హీరో కార్తికేయలోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే.. కార్తికేయ ఈ సినిమా ద్వారా పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేలా హింట్ ఇచ్చాడనే ఫీలింగ్ కలుగుతున్నది.

 Karthikeyas Guna 369 Teaser released

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుకుంటున్న 'గుణ 369' అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఎక్స్ 100 తో యువత మనసు దోచుకున్న కార్తికేయపై ప్రేక్షకుల్లో భారీ హోప్స్ ఉన్నాయి. హిప్పీ ప్లాప్ అయినప్పట్టికీ గుణ 369 సినిమా ద్వారా ఆయన సక్సెస్ కావడం ఖాయం అంటున్నారు ఈ టీజర్ చూసిన జనం. కథలో కొత్తదనం, ఊహించని మలుపులతో గుణ 369 కథ ఆద్యంతం ఆకట్టుకుంటుందని అంటోంది చిత్రయూనిట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X