twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘హిప్పి’ టీజర్... కార్తికేయ లుక్ అదుర్స్, ఆర్ఎక్స్ 100ను మించిన రొమాంటిక్ డోస్

    |

    'ఆర్ఎక్స్ 100' సినిమా విజయంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొత్త కుర్రాడు కార్తికేయ... మరో రొమాంటిక్ డ్రామాతో యువతను ఎంటర్‌టైన్ చేయబోతున్నాడు. 'హిప్పి' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి టిఎన్ కృష్ణ దర్శకత్వం వహించారు.

    తాజాగా 'హిప్పి' టీజర్ విడుదలైంది. కాంటెంపరరీ రిలేషన్స్, లవ్, రొమాన్స్ లాంటి అంశాలను బేస్ చేసుకుని ఈ చిత్రం రూపొందించినట్లు టీజర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. 'ఆర్ఎక్స్ 100' సినిమాను మించిన రొమాంటిక్ డోస్ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

    కార్తికేయ లుక్ అదిరిపోయింది

    కార్తికేయ లుక్ అదిరిపోయింది

    సిక్స్ ప్యాక్ బాడీతో బాక్సింగ్ చేస్తూ కనిపించిన కార్తికేయ లుక్ సూపర్బ్ అనేలా ఉంది. టీజర్లో అతడి చుట్టూ అమ్మాయిలు, ముద్దు సీన్లు చూస్తుంటే ఇందులో అతడు ప్లేబాయ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

    వెన్నెల కిషోర్, జెడీ

    వెన్నెల కిషోర్, జెడీ

    కార్తికేయతో పాటు వెన్నెల కిషోర్, జెడీ చక్రవర్తి కూడా టీజర్లో కనిపించారు. ఈ ఇద్దరి సీన్లు టీజర్లో ఫోకస్ చేయడం ద్వారా సినిమాలో కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్ ఉంటుందనే హింట్ ఇచ్చారు.

    అంచనాలు పెంచిన టీజర్

    ‘హిప్పి' టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ముఖ్యంగా యూత్ మెచ్చే మసాలా బాగా దట్టించారు. విజువల్స్ కలర్ ఫుల్‌గా సరికొత్త తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తాయని స్పష్టమవుతోంది.

    హిప్పి

    హిప్పి

    కార్తికేయ సరసన దిగాంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టి.ఎన్‌.కృష్ణ ద‌ర్శ‌కత్వంలో వి క్రియేష‌న్స్ , ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.డి. రాజ‌శేఖ‌ర్, సంగీతం: నివాస్ కె.ప్ర‌స‌న్న, ఎడిటింగ్‌: ప‌్ర‌వీణ్ కె.ఎల్‌, స్టంట్‌: దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌.

    English summary
    Hippi Movie Teaser released. Hippi 2019 Movie ft. Karthikeya, Digangana Suryavanshi and Jazba Singh. Written and Directed by TN Krishna and Music by Nivas K Prasanna. Produced by Kalaippuli S Thanu under V Creations Banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X