వైరల్ వీడియో: ఆర్ఎక్స్ హీరో రెచ్చిపోయాడు.. ఏకంగా ఇద్దరు హీరోయిన్లతో చెప్పలేని రొమాన్స్

Recommended Video

Hero Karthikeya Latest Movie Hippi Trailer Released

ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా అందునా లిప్ లాక్స్ హవా బాగా పెరిగింది. ఏ సినిమా చూసినా బాలీవుడ్ హీరోలను మించి హీరోయిన్లను ముద్దులతో ముంచెత్తుతున్నారు తెలుగు హీరోలు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ రాజ్‌పుత్ తో తెగ రొమాన్స్ చేసిన హీరో కార్తికేయ ఈ సారి ఏకంగా ఇద్దరు హీరోయిన్ల వెంట పడ్డాడు. పడటమే కాదు ముద్దుల వరద పారించాడు. ఈ రొమాన్స్ మరికొద్ది రోజుల్లోనే థియేటర్లలో హంగామా చేయనుంది. ఆ వివరాలు చూద్దామా..

రెండో సినిమానే అయినా

రెండో సినిమానే అయినా

కెరీర్ పరంగా కార్తికేయకు మంచి ఆలోచనలు ఉన్నట్టున్నాయి. ఆర్ఎక్స్ 100 తర్వాత కార్తికేయ తన రెండో సినిమాగా విలక్షణ కథాంశం 'హిప్పీ' ఎచుకోవడమే ఇందుకు నిదర్శనం. ఈ చిత్రంలో కార్తికేయ ఇంతవరకు ఏ హీరో చేయని డిఫెరెంట్ రోల్ లో పైగా రొమాంటిక్ యాంగిల్ లో నటిస్తున్నారు. ఇప్పటికే హిప్పీ ఫస్ట్ లుక్ మొదలుకొని ఈ సినిమాకు సంబందించిన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

పనీ పాట లేకుండా తిరిగేవాడిని..

పనీ పాట లేకుండా తిరిగేవాడిని..

హిప్పీ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు. ఈ మేరకు తాజాగా హిప్పీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ''ఓటుకు నోటు కావాలె మంచి లీడర్ కావాలె అనుకోవడం ఎంత గలతో.. మంచి గర్ల్ ఫ్రెండ్ కావాలె, జిందగీ సుఖంగా ఉందనుకోవడం కూడా అంతే గలత్'' అని చక్రవర్తి చెబుతున్న డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ లో ''బేసిక్‌గా ఇంజనీరింగ్ ఫినిష్ చేసి పనీ పాట లేకుండా ఖాళీగా తిరిగేవాడ్ని.. ఆ టైంలో వచ్చి ప్రపోజ్ చేశావ్ ఎలాగూ ఖాళీగా ఉన్నా కదా అని యాక్సెప్ట్ చేశా'' అని కార్తికేయ చెప్పే డైలాగ్ హీరో క్యారెక్టర్‌ని డిఫైన్ చేస్తోంది.

ఇద్దరు హీరోయిన్లతో రెచ్చిపోయి రొమాన్స్

ఓ ప్లే బాయ్ గా కార్తికేయ ఇద్దరు హీరోయిన్లతో రెచ్చిపోయి రొమాన్స్ చేయడం, ముద్దుల వరద పారించడం ఈ ట్రైలర్ లో ఆకర్షణీయమైన పాయింట్. దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. హీరో కార్తికేయ రొమాంటిక్ ఫీల్ ఉన్న బాక్సర్ గా నటిస్తున్నాడు.

ఆర్ఎక్స్ 100 మరిపించేలా

ఆర్ఎక్స్ 100 మరిపించేలా

''అబ్బాయిలు అమ్మాయిలకు 100 రూపాయిలు ఖర్చు పెడితే.. దాన్ని ఏ రూపంలో రాబట్టుకోవడానికి ట్రై చేస్తారో అమ్మాయిలకు బాగా తెలుసు'' అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ చూస్తుంటే ఈ సినిమా ద్వారా యూత్ కి ఇచ్చే మెసేజ్ ఏంటో కొంచెం అర్థం చేసుకోవచ్చు. ఇక హీరో హీరోయిన్స్ రొమాన్స్ పరంగా అయితే హిప్పీ ఖచ్చితంగా ఆర్ఎక్స్ 100 మరిపించేలా ఉంటుందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే యాక్షన్, లవ్, రొమాన్స్ పుష్కలంగా ఉన్న హిప్పీ ట్రైలర్‌ యూత్‌ని ఆకట్టుకునేలా కట్ చేయబడింది.

హిప్పీ మూవీ

హిప్పీ మూవీ

టీఎన్ క్రిష్ణ దర్శకత్వంలో హిప్పీ తెరకెక్కింది. కార్తికేయ, దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరో హీరోయిన్లుగా నటించగా.. నివాస్ కె ప్రసన్న సంగీతం సమకూర్చారు. కళైపులి ఎస్.థాను ఈ చిత్రానికి నిర్మాత. జూన్ 6న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు రెడీ అయింది హిప్పీ మూవీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X