RX100 హీరో అని మాత్రమే తెలుసు.. నాకింత సీన్ లేదు..కార్తికేయ

ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ ఆడియన్స్ లో క్రేజ్ సంపాదించాడు హీరో కార్తికేయ. ఆయన కెరీర్ లో రాబోతున్న కొత్త సినిమా 'గుణ 369'. కార్తికేయ మూడో ప్రాజెక్టుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్రంలో కార్తికేయ సరసన అనఘా హీరోయిన్‌గా నటించింది. స్పిన్ట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, బోయపాటి శ్రీను ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆగస్టు 2 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సందర్బంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ''మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్లు అరవింద్ గారు, బోయపాటి శ్రీను గారు వల్ల పెద్ద ధైర్యం వచ్చింది. మీకు థాంక్స్ చెప్పడం చిన్న మాట. గతంలో మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సరైనోడు' సినిమాను మించి ఇది హిట్ అవుతుంది. ఊరికే పంచ్ బాగుంటది అన్నా(నవ్వుతూ). ఈ సినిమా సూపర్ హిట్, పెద్ద హిట్ అని అనను, ఇది నాకు హార్ట్ టచింగ్ మూవీ. కథ విన్న 30 నిమిషాల్లోనే ఓకే చెప్పా. కథ పూర్తిగా వినకుండానే డిసీజన్ తీసుకున్న. అలా ఎందుకు ఒప్పుకున్నానో సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. రియలిజం ఈ సినిమాలో చూస్తారు. ఈ సినిమాలో ఎక్కడా హీరో హీరోలా ఉండడు. హీరోయిన్ హీరోయిన్ గా ఉండదు. అంత రియాలిక్ గా ఉంటుంది ఈ సినిమా.

Karthikeyas super speech at Guna 369 trailer launch

తమిళ్ లో మలయాళం లోనే రియాలిటిక్ సినిమాలు ఉంటాయని, తెలుగులో కేవలం కమర్షియల్ సినిమాలే ఉంటాయని అంటారు. అలాంటి వాటికి గట్టిగా సమాధానం చెప్పే సినిమానే ఇది. ముఖ్యంగా గుణ క్యారెక్టర్ నాకు మంచి పేరు తెస్తుంది. ఇప్పటికీ నా పేరు కార్తికేయ అని చాలా మందికి తెలియదు. ఆర్ఎక్స్ 100 హీరో అని మాత్రమే తెలుసు. కానీ ఈ సినిమా తర్వాత నన్ను హీరో అనరు.. గుణ అని పిలుస్తారు. నిజం చెప్తున్నా.. డబ్బింగ్ చెబుతుంటే నాకింత సీన్ లేదు కదా! అనుకున్నా. మూవీ లవర్ గా గుణ జర్నీ మిస్ కాకండి. మీకు మంచి థ్రిల్ ఇస్తుంది. ఈ సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు చిత్రయూనిట్ అందరికీ కృతజ్ఞతలు. ఆగస్టు 2 నుంచి థియేటర్స్ లో మనకు డిఫెరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది'' అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X