వివాదంలో గుణ 369 టైటిల్.. కార్తీకేయ సినిమా టైటిల్‌పై అభ్యంతరం
RX 100 మూవీ ఘన విజయం తర్వాత హీరో కార్తీకేయ నటిస్తున్న చిత్రం గుణ 369. ఇటీవల రిలీజైన టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకొన్నది. కార్తీకేయ కెరీర్‌లో ఇది మూడో చిత్రం. RX 100 తర్వాత ఆయన హిప్పీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మూడో సినిమాకు సంబంధించిన టైటిల్ లుక్‌ను విడుదల చేయడం జరిగింది. అయితే గుణ టైటిల్‌పై తెలంగాణ ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు నమోదైంది. తమ సినిమా టైటిల్‌ను నింబంధనలకు విరుద్ధంగా వాడుకొన్నారనే గుణ దర్శకుడు కళాధర్ కొక్కొండ ఆరోపించారు.
కళాధర్ కొక్కొండ నటిస్తూ, స్వీయ దర్శకత్వం రూపొందుతున్న చిత్రం గుణ. నటులు సెల్వరార్, దిల్ రమేశ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. సనాతన క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతున్నది. ఈ చిత్రం ఇప్పటివరకు 80 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుంది.

కాగా గుణ టైటిల్‌ను RX 100 హీరో కార్తికేయ తన కొత్త సినిమాకు పెట్టుకోవడంపై గుణ చిత్రం నటుడు, దర్శక, నిర్మాత కళాధర్ కొక్కొండ మండిపడ్డారు. ముందుగా గుణ టైటిల్‌ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించామని తెలిపారు. తమ సినిమా టైటిల్‌ను దర్శకుడు అర్జున్ జంధ్యాల బృందం వాడుకొన్నదని ఆరోపించారు. మా టైటిల్‌ను వాడుకొని దాని పక్కన '369' అంకెను తగిలించడంపై కళాధర్ కొక్కొండ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌తోపాటు ఏపీ ఫిల్మ్ ఛాంబర్లో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమకు పూర్తిగా న్యాయం జరిగే వరకు పోరాడుతామని అన్నారు.
చిత్రం: గుణ
బ్యానర్: సనాతన క్రియేషన్స్
కథ, స్రీన్ ప్లే, నిర్మాత ,దర్శకత్వం: కళాధర్ కొక్కొండ
డిఓపి అండ్ ఎడిటింగ్: శ‌్రవణ్ జి కుమార్
సంగీతం: మార్క్ ప్రశాంత్
మాటలు: గుమ్మా విజయ్ కుమార్
పాటలు: అనిల్ ఇనమడుగు


Click it and Unblock the Notifications











