హిందీలో అల వైకుంఠపురంలో: బాలీవుడ్ హీరో ఫిక్స్.. ఎవరంటే!
బాలీవుడ్‌లో తెలుగు సినిమాల రీమేక్ సందడి భారీగానే కనిపిస్తున్నది. ఇప్పటికే జెర్సీ, డియర్ కామ్రేడ్ చిత్రాలు హిందీలో పునర్మిరించడానికి క్యూ కట్టగా.. తాజా బ్లాక్‌బస్టర్ అల వైకుంఠపురంలో కూడా ఆ జాబితాలో చేరింది. అయితే తెలుగులో భారీ విజయాన్ని అందుకొన్న అల వైకుంఠపురంలో మూవీని హిందీలో అల్లు అర్జున్, రాధాకృష్ణ టీమ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేశీ బాయ్స్, డిష్యూం చిత్రాలకు దర్శకత్వం వహించిన రోహిత్ ధావన్ డైరెక్షన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ స్థానంలో కార్తీక్ ఆర్యన్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది.
లాక్‌డౌన్ కొనసాగతుండటంతో హిందీ స్క్రిప్టును ఇటీవల వీడియో కాల్ ద్వారా కార్తీక్ ఆర్యన్‌కు చెప్పగా ఆయన సంతృప్తిని, సానుకూలతను వ్యక్తం చేసినట్టు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. లాక్‌డౌన్ పూర్తికాగానే షూటింగ్ చేయడానికి అనుగుణంగా డేట్లు, షెడ్యూల్ వివరాలను ఫైనలైజ్ చేస్తున్నట్టు సమాచారం.

కార్తీక్ ఆర్యన్ ఇప్పటికే దోస్తానా 2 మూవీ పూర్తి చేయగా.. భూల్ భులయ్యా 2 కూడా చివరి దశలో ఉందని బాలీవుడ్ మీడియా పేర్కొన్నది. అలాగే మరో బాలీవుడ్ భారీ చిత్రంలో నటించడానికి కార్తీక్ ఆర్యన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే అల వైకుంఠపురంలో షూటింగ్‌లో పాల్గొనేందుకు వేచి ఉన్నాడు.


Click it and Unblock the Notifications











