డిజాస్టర్ సినిమాతో సక్సెస్ అందుకున్న ఆర్ఎక్స్100 హీరో
ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సాలీడ్ కలెక్షన్స్ అందుకున్న హీరో కార్తికేయ హీరోగా ఎదగడానికి చాలానే కష్టపడ్డాడు. మొదటి సినిమా సక్సెస్ కాకపోయినా ఆ తరువాత కష్టపడి సొంత ప్రొడక్షన్ లోనే ఆర్ఎక్స్100 సినిమాను నిర్మించి సక్సెస్ అందుకున్నాడు. ఫిట్నెస్ తో పాటు సినిమా సినిమాకు సరికొత్త యాక్టింగ్ స్కిల్స్ ని బయటపెడుతున్నాడు. అయితే ఆర్ఎక్స్ 100 తరువాత కమర్షియల్ గా ఈ హీరో అనుకున్నంత సక్సెస్ అయితే అందుకోవడం లేదు.
ఇటీవల వచ్చిన 90ML కూడా కార్తికేయని తీవ్రంగా నిరాశపరిచింది. అసలైతే ఆ సినిమా హిట్టవుతుందని అంతా భావించారు. ఓ వర్గం ఆడియెన్స్ మొదటిరోజే సినిమాను చూడాలని సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అయితే ఎందుకో గాని సినిమా బిగ్ స్క్రీన్ పై అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. కానీ బుల్లితెరపై మాత్రం బాగానే క్లిక్కయింది. లాస్ట్ వీక్ స్టార్ మాలో సినిమా ఫస్ట్ ప్రీమియర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

10.92 అర్బన్ TRP రేటింగ్ తో 90ఎమ్ఎల్ బుల్లితెరపై బాగానే ఆడింది. లాక్ డౌన్ కారణంగా టీవీలలో వచ్చిన సినిమాలే మళ్ళీ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కార్తికేయ 90ML ఓ వర్గం ఆడియెన్స్ ని ఆకట్టుకొని మంచి రేటింగ్ ని అందుకుంది. బిగ్ స్క్రీన్ పై సక్సెస్ కాకపోవడంతో నీరాశచెందిన కార్తికేయ ఈ విదంగా అయినా సక్సెస్ ని ఎంజాయ్ చేసే ఛాన్స్ వచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ హీరో గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి రానున్న 'చావు కబురు చల్లగా' అనే సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











