స్టైలిష్ లుక్‌తో అదరగొట్టిన కార్తీకేయ.. తాజా ఫోటోషూట్‌తో
RX 100, గ్యాంగ్ లీడర్, 90ml లాంటి చిత్రాల్లో నటుడిగా, హీరోగా ప్రేక్షకులకు చేరువైన కార్తీకేయ స్టైల్‌ను మెయింటెన్ చేయడంలో కూడా డిఫరెంట్. ప్రతీ పాత్ర కోసం ఎంతకైనా తెగిస్తాడనే పేరు తెచ్చుకొన్నాడు. తమిళ, తెలుగు రంగాల్లో తనదైన శైలితో ప్రభావం చూపేందుకు విభిన్నమైన పాత్రలను ఎంచుకొంటున్నారు. త్వరలోనే తమిళ రంగానికి చెందిన భారీ బ్యానర్‌లో ప్రముఖ హీరో సినిమాలో కీలక పాత్రను పోషించబోతున్నారనేది తాజా సమాచారం.
RX 100 సినిమాతో సిక్స్ ప్యాక్‌తో కనిపించిన కార్తీకేయ.. నానీ గ్యాంగ్ లీడర్ సినిమాలో స్టైలిష్ లుక్‌తో అలరించాడు. తాజాగా స్టైలిష్ లుక్‌తో జరిగిన ఫోటోషూట్‌లో పాల్గొన్నాడు. తాను నటిస్తున్న కొత్త చిత్రం కోసం శారీరాకృతిని మార్చుకొని, గడ్డంతో ట్రెండీ లుక్‌తో ఫొటోషూట్‌లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బ్లాక్ సూట్‌పై పలు కలర్లతో చుక్కలు ఉన్న సూట్‌ను ధరించి ఆకట్టుకొంటున్నాడు. తాజా చిత్రాన్ని తన అభిమానుల అంచనాలను పెంచేలా, అలాగే వాళ్ళ స్పందన కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఒక క్యాప్షన్ పెట్టారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఎప్పుడూ చేరువగా ఉండే కార్తీకేయ.. తాజా లుక్‌పై ప్రశంసలు అందుకొంటున్నారు.
ఇక కెరీర్ విషయానికి వస్తే.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి రూపొందించే చిత్రం చావు కబురు చల్లగా చిత్రంలో నటిస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. అంతేకాకుండా తమిళ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. కాకపోతే ఈ వార్తలను కార్తీకేయ అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు.


Click it and Unblock the Notifications











