కార్తికేయతో సుకుమార్ న్యూ మూవీ.. మరో ఉప్పెన లాంటి ప్లాన్!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఓ వైపు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. కథలు రాస్తూ తన శిష్యుల చేతికి స్క్రిప్ట్ ఇచ్చేస్తున్నాడు. కుమార్ 21F తో మంచి క్రేజ్ అందుకున్న సుకుమార్ రైటింగ్స్ భవిష్యత్తులో ఉప్పెన లాంటి మరిన్ని బాక్సాఫీస్ హిట్స్ ను అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక మరో యంగ్ హీరో కోసం సుకుమార్ కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. కార్తికేయ గుమ్మకొండ. ఆర్ఎక్స్ 100 సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న కార్తికేయ వీలైనంత వరకు డిఫరెంట్ సినిమాలను చేసుకుంటూ ఇండస్ట్రీని ఆకర్షించాడు. ఇక నెక్స్ట్ ఈ యువ హీరో సుకుమార్ రైటింగ్స్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు

Kartikeya Gummakonda new movie in sukumar writings official

ఈ న్యూస్ ముందు నుంచే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికి రీసెంట్ గా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. సుకుమార్ రైటింగ్స్ లో స్క్రిప్ట్ అందిస్తూ ఆయన శిష్యుడి ద్వారా డైరెక్షన్ చేయించనున్నారట. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్న ఈ స్టార్ దర్శకుడు ఆ సినిమా అనంతరం విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అలాగే మరికొంత మంది కొత్త దర్శకులను కూడా సుకుమార్ రైటింగ్స్ లో పరిచయం చేయబోతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X