అజిత్‌కు తెలుగు యంగ్ హీరో సవాల్.. తన సత్తా చూపించేందుకు చెన్నై వెళ్తున్నాడు.!

By Manoj

తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు అజిత్ కుమార్. దాదాపు ముప్పై ఏళ్ల సినీ జీవితంలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిన మెప్పించాడు. అదే సమయంలో దక్షిణాదిలో చాలా మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నాడు. పేరుకు సీనియర్ హీరోనే అయినా.. స్టైలిష్ లుక్, విలక్షణమైన నటనతో ఇప్పటికీ రాణిస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. 48 ఏళ్ల వయసులోనూ చక్కనైన ఫిజిక్ మెయింటేన్ చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇలాంటి హీరోకు మన తెలుగు హీరో సవాల్ విసిరేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకీ ఎవరా హీరో.? ఎందుకిలా చేస్తున్నాడు.?

రీమేక్ సినిమాతో హిట్ కొట్టాడు

రీమేక్ సినిమాతో హిట్ కొట్టాడు

అజిత్ కొద్ది రోజుల పాటు సరైన హిట్ పడక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా ఏ ఒక్కటీ మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ క్రమంలో అతడు బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్' రీమేక్‌లో నటించాడు. ‘నెర్కొండ పార్వాయి' అనే టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది.

 మరోసారి అవకాశం ఇచ్చాడు

మరోసారి అవకాశం ఇచ్చాడు

క్లిష్ట పరిస్థితుల్లో మంచి విజయాన్ని అందించిన ‘నెర్కొండ పార్వాయి' డైరెక్టర్ హెచ్ వినోద్‌కు అజిత్ కుమార్ మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ‘వాలిమై' అనే సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అజిత్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అజిత్ సినిమాలో టాలీవుడ్ హీరో

అజిత్ సినిమాలో టాలీవుడ్ హీరో

సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న ‘వాలిమై'పై తమిళ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే, ఇందులో స్టారింగ్ కూడా అదే స్థాయిలో ఉండేలా చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మూవీలో విలన్‌గా తెలుగు హీరో కార్తికేయను తీసుకుంటున్నారని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 తెలుగులోనూ ఆ హీరోతో గొడవ పడ్డాడు

తెలుగులోనూ ఆ హీరోతో గొడవ పడ్డాడు

‘RX100' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు కార్తికేయ. ఈ సినిమా అతడికి ఎంతో పేరు తీసుకొచ్చింది. అలాగే, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో రాబట్టింది. దీని తర్వాత అతడు మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే సమయంలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్' సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించాడు.

చావు కబురు చల్లగా చెప్పాడు

చావు కబురు చల్లగా చెప్పాడు

కార్తికేయ ఇటీవల ‘90ML' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. దీని తర్వాత అతడు ‘చావు కబురు చల్లగా' అనే సినిమాలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ మూవీని గీతా అర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. కౌశిక్, సునీల్ సహా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X