Raja Vikramarka Trailer: దీపావళీ చాలా గ్రాండ్‌గా, పాండవుల టార్గెట్ కౌరవుల చావు కాదు.. కార్తికేయ వన్‌మ్యాన్ షో

ఆర్ఎక్స్ 100 సినిమా తో బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్న కార్తికేయ ఆ తర్వాత అదే తరహాలో విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ను హైలెట్ అయ్యేలా చూసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు రాజా విక్రమార్క అనే మరొక విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. చూస్తుంటే కార్తికేయ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకునేలా ఉన్నాడు అని కూడా అనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

ట్రైలర్ రిలీజ్

ట్రైలర్ రిలీజ్

కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. ఈ నెల 12న ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ అయితే ప్రేక్షకుల్లో ఒక్కసారిగా పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది పక్కా కమర్షియల్ సినిమా అనుకున్నారు. కానీ ఈసారి కార్తికేయ అంతకు మించి అనేలా సరికొత్తగా ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.

కార్తికేయ సరికొత్త యాంగిల్

కార్తికేయ సరికొత్త యాంగిల్

సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా కామెడీలో తన సరికొత్త యాంగిల్ ను చూపించినట్లు తెలుస్తోంది. ఇక వెంటనే మళ్ళీ సీరియస్ గా కూడా థ్రిల్లింగ్ అంశాలను హైలెట్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది ట్రైలర్ అయితే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

 రాజ విక్రమార్క.. టైటిల్ కు తగ్గట్టుగా

రాజ విక్రమార్క.. టైటిల్ కు తగ్గట్టుగా

హోమ్ మినిస్టర్ ఎదురింట్లోనే దొంగతనం చేసేందుకు సిద్దమైన హీరో అలాగే హోమ్ మినిస్టర్ కూతురు ని ప్రేమలోకి దింపాలని చూస్తాడు. అసలు సరదాగా గడిపే హీరో హఠాత్తుగా ఎలాంటి సమస్యల్లో చిక్కుకొని రాజ విక్రమార్క లాగా బయటకు వచ్చాడు అనేది అసలు పాయింట్. సినిమాలో తనికెళ్ల భరణి డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక కార్తికేయ బాడీ లాంగ్వేజ్ అయితే చాలా కొత్తగా ఉంది. అతను కామెడీలోనే కాకుండా సీరియస్ లుక్ తో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్నాడు.

క్యూట్ లవ్ స్టొరీ

క్యూట్ లవ్ స్టొరీ

ఇక హీరోయిన్ తన్య రవిచంద్రన్ కూడా చాలా అందంగా కనిపిస్తోంది. కార్తికేయకు ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా రొమాంటిక్ గా క్యూట్ గా ఉన్నాయి. తప్పకుండా సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అర్ధమవుతోంది. ఈ సినిమాతో కార్తికేయ ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు.

Recommended Video

#CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !

స్టార్ క్యాస్ట్..

తనికెళ్ల భరణి, హర్ష వర్దన్, సుధాకర్ , సాయి కుమార్ వంటి టాలెంటెడ్ నటులు కూడా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు శ్రీ సరిపల్లిని దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X