హ్యాపీ అనేది చిన్నమాట.. సక్సెస్ ఓ డ్రీమ్‌లా ఉంది.. RX 100 కార్తీకేయ
నేచురల్ స్టార్ నాని, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్‌ల కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నాని'స్ గ్యాంగ్ లీడర్'. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. 'ఆర్‌ఎక్స్100' ఫేమ్ కార్తికేయ ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించారు. సెప్టెంబర్ 13న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్‌తో మంచి కలెక్షన్లు సాధిస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో....
నటుడు కార్తికేయ మాట్లాడుతూ - ''సంతోషంగా ఉంది అని చెప్పడం చాలా చిన్న వర్డ్. నేను ఈ మూవీ చేద్దామని డెసిషన్ తీసుకున్నప్పుడు రకరకాల మాటలు వినపడ్డాయి. కానీ సినిమా చేస్తున్న ప్రాసెస్‌లో నేను తీసుకున్న డెసిషన్ మంచిదేనని అర్ధమయింది. ఈరోజు ఇంత పెద్ద రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నా క్యారెక్టర్‌కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఒక డ్రీమ్‌లా ఉంది. ఇందులో నేను చేసిన పెర్ఫామెన్స్ విక్రమ్ సర్ నాకు నేర్పించి చేపించారు. నాని గారు ఈ సినిమా ముందు వరకూ నాకు ఇన్స్‌పిరేషన్, ఈ సినిమాతో నాకు ఒక మెంటర్, ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. మీరు చేస్తున్న ఎంకరేజ్ భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు చేయడానికి ఉపయోగపడుతుంది 'అన్నారు.

నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ - '' సెప్టెంబర్ 13న విడుదలైన మా 'నాని'స్ గ్యాంగ్‌లీడర్ బ్రహ్మాండమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ఉంది. ఈరోజు మౌత్ పబ్లిసిటీతో ఇంకా యేటర్స్ పెంచారు. మా బేనర్‌లో మరో మంచి క్వాలిటీ ఫిలిమ్. హ్యుజ్ బ్లాక్ బస్టర్. చాలా చోట్ల నాని గారి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అలాగే లాంగ్ రన్‌లో కూడా బెస్ట్ కలెక్షన్స్ సాధిస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అందరూ థియేటర్స్‌లో సినిమా చూడండి. మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు'' అన్నారు.


Click it and Unblock the Notifications











