అల్లు అర్జున్ కోసం గోడ దూకాను.. థియేటర్లో స్టెప్పులు వేశా.. హీరో కార్తికేయ
నాకు బాగా నచ్చే హీరో అల్లు అర్జున్‌ను చూడటం మాత్రమే తెలుసు. నా సినిమా ఫంక్షన్లకు పెద్ద హీరోలు రావడం చాలా అరుదు. అలాంటి నా సినిమా ఫంక్షన్‌కు ఫేవరేట్ అల్లు అర్జున్ రావడం హ్యాపీగా ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు నేను అందరి మాదిరిగా అల్లు అర్జున్ ఫ్యాన్‌నే. నా స్టూడెంట్ లైఫ్‌లో చైతన్య కాలేజీ గోడ దూకి స్టైలిష్ స్టార్ సినిమా చూశాను. రేసుగుర్రం సినిమా పాటకు థియేటర్లు నేను స్టెప్పులు వేశాను అని హీరో కార్తికేయ ఎమోషనల్ అయ్యారు.
నేను నటించిన చావు కబురు చల్లగా సినిమాకు ముఖ్య అతిథిగా నా ముందు కూర్చోవడం చాలా ఎమోషనల్‌గా ఉంది. డ్యాన్స్ మాస్టర్లు అల్లు అర్జున్ డెడికేషన్ గురించి చెబుతుంటే నాకు చాలా స్ఫూర్తిగా ఉంటుంది. గీతా ఆర్ట్స్‌లో నాకు అవకాశం ఇచ్చి ఈ సినిమా నాతో చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను అని కార్తీకేయ తెలిపారు.

నేను బీటెక్ చేస్తున్నప్పుడు అందాల రాక్షసి సినిమా చూశాను. అప్పుడు నిన్ను చూసి ఫిదా అయిపోయాం. అలాంటి హీరోయిన్‌తో కలిసి నటించడం నాకు చాలా హ్యపీగా ఉంది. నీవు నాకు సీనియర్ అయినప్పటికీ.. మీరు నాకంటే చిన్నదానివే అంటూ కార్తీకేయ అన్నారు.
రచన, దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
ఎడిటర్: సత్య
డీవీపీ: కామ్ చావ్లా
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
ఆర్ట్ డైరెక్టర్: జీఎం శేఖర్
బ్యానఱ్: జీఏ2 పిక్చర్స్


Click it and Unblock the Notifications











