Bedurulanka 2012 టాలీవుడ్‌లో బెంచ్ మార్క్ మూవీ.. బెస్ట్ రూరల్ డ్రామా.. కార్తీకేయ లుక్ వైరల్
RX 100 మూవీతో స్టార్ హీరోగా మారి దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకొన్న హీరో కార్తీకేయ గుమ్మకొండ. హీరోగానే కాకుండా నాని, అజిత్ సినిమాల్లో విలన్‌గా చేసి మంచి క్రేజ్ సంపాదించుకొన్నారు. కార్తికేయ నటించిన తాజా చిత్రం బెదురులంక 2012. రూరల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే అంచనాలు పెంచేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను గ్రాండ్‌గా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా వివరాల్లోకి, రిలీజ్ డేట్ విషయంలోకి వెళితే..
డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి నటించిన ఈ సినిమాను లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పించారు. ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

కార్తికేయ గుమ్మకొండ నటించిన బెదురులంక 2012 రిలీజ్ డేట్ పోస్టర్ మంచి వైరల్ అయింది. గుట్టలుగా పోసిన మాస్క్‌లపై కార్తీకేయ నిలబడిన తీరు ఆకట్టుకొన్నది. ఈ సినిమా కొత్తగా ఉండబోతుందనే విషయాన్ని వెల్లడించింది. కార్తికేయ స్టైల్, యాటిట్యూడ్ కొత్తగా కనిపించింది.
చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ.. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ఇది. కొత్త కంటెంట్, బ్యూటిఫుల్ విజువల్స్, మంచి పాటలతో మేం బెదురులంక 2012 మూవీని తీశాం. ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి ఈ సినిమా తీసుకెళ్తుంది. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఉంటుంది. గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే బెదురులంక 2012 ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అని అన్నారు.
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ''ఇప్పటికే విడుదలైన బెదురులంక 2012 టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు అందరూ సినిమా విడుదల ఎప్పుడు? ఎప్పుడు? అని అడుగుతున్నారు. ఆగస్టు 25న బెదురులంక 2012 ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపిస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడించడంతో పాటు మిగతా పాటలను విడుదల చేస్తాం. మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందించారు. పాటల్లోనూ, సన్నివేశాల్లోనూ కార్తికేయ, నేహా జోడీ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది అని అన్నారు.

నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు
యువరాజ్, నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పానేని
సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల,
రచన, దర్శకత్వం : క్లాక్స్
యాక్షన్: అంజి, పృథ్వీ
కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల
పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ
ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య
ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి
కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్
సంగీతం: మణిశర్మ
రిలీజ్ డేట్: 2023-08-25


Click it and Unblock the Notifications











