For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

20 లక్షల గుణ 369 టీజ‌ర్‌.. యూత్‌ను కేకపెట్టిస్తున్న డైలాగ్స్‌!

|

మ‌న ఆర్‌.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ‌ను ఇక‌పై అంద‌రూ గుణ 369 హీరో కార్తికేయ అని అన‌డం ఖాయం... అని ఘంటాప‌థంగా చెబుతున్నారు గుణ 369 చిత్రం టీజ‌ర్ చూసిన వాళ్లు అని అంటున్నారు శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల‌. ఆమె స‌మ‌ర్పిస్తున్న చిత్రం గుణ 369. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాలకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. మ‌నం చేసే త‌ప్పుల వ‌ల్ల మ‌న జీవితాని కి ఏం జ‌రిగినా ఫ‌ర్వాలేదు. కానీ ప‌క్క‌నోడి జీవితానికి ఏ హానీ జ‌ర‌గ‌కూడ‌దు అని సాయికుమార్ గంభీర‌మైన స్వ‌రంతో చెప్పే మాట‌ల‌తో గుణ 369 టీజ‌ర్ సోమ‌వారం ఉద‌యం విడుద‌లైంది. టీజ‌ర్ రిలీజైన కొద్దీ క్ష‌ణాల్లోనే నెట్టింట్లో ట్రెండ్ అయింది. కేవలం 24 గంటల్లోనే గుణ 369 టీజర్ 10 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకొన్నది. అంతేకాకుండా 20 లక్షల (2 మిలియన్) వ్యూస్‌కు చేరువైంది. ఈ టీజర్ 2,020,283 వ్యూస్‌తో దూసుకెళ్తున్నది.

ఈ టీజర్‌లోని డైలాగ్స్‌కు విశేష స్పందన లభిస్తున్నది.ఆర‌డ‌గుల హీరో ఓ అమ్మాయి ముందు నిలుచుని స్మైల్ ఇవ్వొచ్చు క‌దా ఒక్క సెల్ఫీ.., నేనూ ఎప్పుడూ అనుకోలేదండీ. ఇలా బ‌ల‌వంతంగా ష‌ట్ట‌ర్ క్లోజ్ చేసి ఒక‌మ్మాయితో మాట్లాడ‌తాన‌నీ.. నాతో మీరు మాట్లాడాల్సిన ప‌నిలేదు. మీతో మీరు మాట్లాడేయండి అని ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తూ చెప్పే డైలాగులు యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి.

Kartikeyas Guna 369 teaser knocks 1 million views

మాలాంటి వాళ్లు మీలాంటి వాళ్ల‌ను చూసి భ‌య‌ప‌డేది, గొడ‌వ‌లంటే మూసుకుని కూర్చునేది మాకేద‌న్నా అవుతుంద‌ని కాదు. మా అనుకున్న వాళ్ల‌కు ఏద‌న్నా అవుతుంద‌న్న చిన్న భ‌యంతో... అని టీజ‌ర్‌లో ఆఖ‌రిగా హీరో నోటి వెంట వ‌చ్చే డైలాగులు మాస్ జ‌నాల చేత చ‌ప్ప‌ట్లు కొట్టిస్తున్నాయి లాంటి డైలాగ్స్ ఆకట్టుకొంటున్నాయి.

టీజ‌ర్‌కు వ‌స్తున్న స్పంద‌న గురించి ద‌ర్శ‌కుడు అర్జున్‌ జంధ్యాల మాట్లాడుతూ టీజ‌ర్ విడుద‌లైన కొన్ని క్ష‌ణాల నుంచే ఫోన్లు మొద‌ల‌య్యాయి. టీజ‌ర్ చాలా బావుందంటూ అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. టీజ‌ర్‌లో డైలాగులు, లొకేష‌న్లు, న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్, కెమెరా, కాస్ట్యూమ్స్... ఇలా ప్ర‌తి విష‌యం గురించి డీటైల్డ్ గా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. టీజ‌ర్ ఎంత బావుందో, సినిమా అంత‌కు వెయ్యి రెట్లు బావుంటుంద‌ని న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌ల‌ను. ఫ‌స్ట్ లుక్‌కు, ఇప్పుడు టీజ‌ర్‌కు వ‌స్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి యూనిట్ అంతా ఆనందంగా ఉన్నాం అని చెప్పారు.

నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ మా టీజ‌ర్ కు అద్భుత‌మైన స్పందన‌ వ‌స్తోంది. యువ‌త‌కు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విష‌యాలు, మాస్ ప్రేక్ష‌కుల‌ను న‌చ్చే స‌న్నివేశాల స‌మాహారంగా టీజ‌ర్ ఉంద‌ని, ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుంద‌ని... ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఇదే ఉత్సాహంతో ఈ నెలాఖ‌రున పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. మూడు రోజుల మిన‌హా షూటింగ్ పూర్త‌యింది. ఆ స‌న్నివేశాల‌ను కూడా త్వ‌ర‌లోనే తెర‌కెక్కిస్తాం. ఇప్ప‌టిదాకా వ‌చ్చిన ఔట్‌పుట్ చూశాం. చాలా సంతృప్తిక‌రంగా ఉంది. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే హిట్ సినిమా తీశామ‌నే కాన్ఫిడెన్స్ వ‌చ్చింది. సినిమాకు స‌ర్వ‌త్రా పాజిటివ్ బ‌జ్ క్రియేట్ అయింది. మా హీరోగారి కెరీర్‌లోనూ, మా కెరీర్‌లోనూ గుణ 369 చెప్పుకోద‌గ్గ‌ గొప్ప సినిమా అవుతుందనే న‌మ్మ‌కం ఉంది అని అన్నారు.

సాంకేతిక నిపుణులు

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, కెమెరామెన్‌: 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్: తమ్మిరాజు , డాన్స్ : రఘు, భాను, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు : స‌త్య

కిశోర్‌, శివ మల్లాల.

English summary
After bagging a sensational hit with RX100, story that was reeled out of real life incidents, Actor Kartikeya seems to don another challenging role in his 3rd movie directed by debutant Arjun Jandyala. Produced by Anil Kadiyala, Tirumal Reddy under Gnapika Productions & Sprint Films, movie is titled as 'Guna 369'. Recently released teaser knocks 1 million views in no time.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more