సూర్య రిజెక్ట్ చేసిన రాజమౌళి సినిమా ఏంటో తెలుసా? గోల్గెన్ ఆఫర్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టిన యంగ్ హీరో ఎవరంటే?
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించాలని హీరోలందరూ కలలు కనడంలో ఎలాంటి అశ్చర్యం లేదు. ఎందుకంటే హీరోలకు జక్కన్న ఇచ్చే ఎలివేషన్ ఓ రేంజ్‌లో ఉంటుంది. హీరోయిజం, క్యారెక్టరైజేషన్, మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్ అన్నీ ప్యాకేజ్‌గా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తుంటారు. అయితే అలాంటి డైరెక్టర్ స్వయంగా ఆఫర్ ఇస్తే.. వద్దనే వాళ్లు ఉంటారా? అయితే అలాంటి అవకాశాన్ని మాత్రం ఓ హీరో మాత్రం వదులుకొన్నారు. తాను తీసుకొన్న నిర్ణయానికి ఇప్పటికీ పశ్చత్తాపం చెందుతున్నానని.. మళ్లీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని రాజమౌళితో సదరు హీరో చెప్పడం ట్రెండ్ అయింది. అయితే రాజమౌళి సినిమాను వదులుకొన్న హీరో ఎవరు? ఆ సినిమా ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి సక్సెస్ అందుకొంటూ గుర్తింపు తెచ్చుకొంటున్న సమయంలో హీరో సూర్యను కలిసి కథ చెప్పాడు. అప్పటికే శివపుత్రుడు, గజని లాంటి సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న సూర్య కథ విన్న తర్వాత కొద్ది రోజులు ఆలోచించాడు. అయితే రాజమౌళి చెప్పిన కథను చేయడం కుదరదు. మరోసారి మరో సినిమా చేద్దాం. ప్రస్తుతం తాను చేసే సినిమాలు వేరే జోనర్‌లో ఉన్నాయి అని ఆ కథను రిజెక్ట్ చేశాడట.

అయితే జక్కన్న మాత్రం అదే కథను మొదటి చిరంజీవికి చెప్పాడు. అయితే చిరంజీవి తన కోసమే ఆ కథ అని ఫీల్ అయితే.. మీకు కాదు.. మీ అబ్బాయి రాంచరణ్ కోసం అనుకొంటున్నాను అని ట్విస్ట్ ఇచ్చారట. ఆ తర్వాత చిరంజీవి, రాంచరణ్‌కు నచ్చడం.. ఆ సినిమా మగధీర కావడం అందరికి తెలిసిందే. మగధీర విజయంతో రాజమౌళి రేంజ్ పెరిగింది. అప్పటి వరకు స్టార్ స్టేటస్ కోసం కష్టపడుతున్న రాంచరణ్‌కు తెలుగులో స్టార్ హీరో అవ్వడం జరిగిపోయింది.
ఆ మధ్య సూర్య నటించిన కంగువా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఆ వేడుకకు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. జీవితంలో మనం అందరం తప్పులు చేస్తాం. నా జీవితంలో ఒక తప్పు చేశాను. రాజమౌళి సార్‌తో పనిచేసే అవకాశాన్ని వదులుకొన్నాను. అందుకు నిజంగా సారీ చెబుతున్నాను. నా లైఫ్‌లో మీతో పనిచేసే పెద్ద అవకాశాన్ని మిస్ చేసుకొన్నాను అని ఎమోషనల్ అయ్యారు.
అంతేకాకుండా మన జర్నీ ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. నేను ఎక్కాల్సిన ట్రైన్‌ను మిస్ చేసుకొన్నాను. కానీ నా తప్పు తెలుసుకొని నేను ఎక్కాల్సిన ట్రైన్ మళ్లీ వస్తుందని అదే స్టేషన్‌లో నిలబడి ఉన్నాను. మళ్లీ ఆ ట్రైన్ వస్తే ఎక్కేందుకు ఆశగా ఎదురు చూస్తున్నాను అని సూర్య అన్నాడు. అయితే సూర్య మాటలకు సమాధానం ఇస్తే.. ఆ రోజు నీవు తీసుకొన్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. ఎందుకంటే కథను నమ్మే నీవు.. దర్శకుడిని ఎందుకోలేదు. ఇప్పటికీ ఆ నిర్ణయాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. నేను పాన్ ఇండియా సినిమాలు చేయడానికి నీవే స్పూర్తి అని రాజమౌళి అన్నారు. అయితే సూర్య నటించిన కరుప్పు సినిమా ఘన విజయం సాధిస్తున్న నేపథ్యంలో సూర్య, రాజమౌళి మధ్య జరిగిన సంభాషణ వైరల్ అవుతున్నది.
సూర్య కెరీర్ విషయానికి వస్తే.. దాదాపు 9 ఏళ్లుగా ఆయన సరైన సక్సెస్ లేకుండా కెరీర్ కొనసాగిస్తున్నాడు. తొమ్మిదేళ్ల తర్వాత ప్రస్తుతం కరుప్పు సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. ఈ చిత్రం సుమారుగా 250 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications


